ఏజెంట్ సినిమాతో మూడింతలు పెరిగిన అఖిల్ మార్కెట్?

అక్కినేని వారసుడిగా అఖిల్ సిసింద్రీ సినిమాతో బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.అనంతరం ఈయన అక్కినేని కుటుంబం మొత్తం కలిసిన అఖిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు.

 Akhil Get Another Range With The Agent Movie , Akhil, Tollywood, Agent Movie, Telugu Film Industry-TeluguStop.com

అయితే అఖిల్ హీరోగా అఖిల్ సినిమా ద్వారా వెండితెరపై సందడి చేశారు.అయితే ఈయన నటించిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేదు.

ఇలా వరుసగా మూడు సినిమాలు చేసినప్పటికీ అఖిల్ కి పెద్దగా గుర్తింపు రాలేదు.ఇకపోతే గత ఏడాది బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దొరికేక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టిన అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నారు.

 Akhil Get Another Range With The Agent Movie , Akhil, Tollywood, Agent Movie, Telugu Film Industry-ఏజెంట్ సినిమాతో మూడింతలు పెరిగిన అఖిల్ మార్కెట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే అఖిల్ సినిమాతో పోలిస్తే ఏజెంట్ సినిమాకి అఖిల్ మార్కెట్ మూడింతలు పెరిగినట్టు తెలుస్తోంది.ఈయన నటించిన మొదటి సినిమా అఖిల్ ప్రపంచవ్యాప్తంగా 21.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.అయితే ప్రస్తుతం ఈయన నటించిన ఏజెంట్ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కేవలం ఆంధ్ర ఏరియాలో మాత్రమే దాదాపు 30 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Akhil, Telugu, Tollywood-Movie

ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్ సినిమా దాదాపు 50 నుంచి 60 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని తెలుస్తోంది.అఖిల్ సినిమా మార్కెట్ తో పోలిస్తే ఏజెంట్ సినిమా మూడింతలు రెట్టింపు అయిందని తెలుస్తోంది.ప్రస్తుతం ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి సంబంధించిన ఈ లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ లెక్కల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అఖిల్ లుక్ చూస్తే మాత్రం ఏజెంట్ సినిమాతో అఖిల్ భారీ హిట్టు కొట్టేలా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube