అఖిల్ కోసం 'గద్దలకొండ గణేశ్' దర్శకుడు  

Director Of \'gaddalakonda Ganesh\' For Akhil-anasuya,gaddalakonda Ganesh,harish Shankar,pradeep,sudigali Sudheer,tollywood Gossips,అఖిల్,హరీశ్ శంకర్

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు గా గుర్తింపు తెచ్చుకున్న హరీశ్ శంకర్ ఇప్పుడు అఖిల్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.గబ్బర్ సింగ్,మిరపకాయ్,షాక్ వంటి పలు హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు హరీశ్ శంకర్ తాజాగా గద్దలకొండ గణేష్ చిత్రం తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Director Of 'Gaddalakonda Ganesh' For Akhil-Anasuya Gaddalakonda Ganesh Harish Shankar Pradeep Sudigali Sudheer Tollywood Gossips అఖిల్ హరీశ్ శంకర్

అయితే ఈ చిత్రం సూపర్ హిట్ అయిన తరువాత నుంచి ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ కోసం హీరోలకి కధలను వినిపిస్తూ తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.అయితే యువ కథానాయకులు అంతా కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉండడం తో ప్రస్తుతం ఆయన దృష్టి అక్కినేని హీరో అఖిల్ పై పడినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో సినిమా చేస్తున్న అఖిల్ ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్ట్ లకు ఒకే చెప్పకపోవడం తో హరీష్ ప్రస్తుతం అఖిల్ కోసం చూస్తున్నారు.

భాస్కర్ దర్శకత్వంలో సినిమా పూర్తి అయిన తరువాత అఖిల్ ఈ చిత్రం చేయడానికి ఒప్పించాలని హరీష్ ప్రయత్నిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.ఒకవేళ హరీష్ కధ అఖిల్ కు వినిపిస్తే దానికి గనుక అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక అఖిల్ తదుపరి చిత్రం హరీష్ తో ఉండబోతుంది అన్నమాట.మరి దీనిపై క్లారిటీ కావలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.

తాజా వార్తలు

Director Of \'gaddalakonda Ganesh\' For Akhil-anasuya,gaddalakonda Ganesh,harish Shankar,pradeep,sudigali Sudheer,tollywood Gossips,అఖిల్,హరీశ్ శంకర్ Related....