అఖిల్ అందుకే ఫ్లాప్ అయ్యింది అన్న హీరోయిన్

అఖిల్ ఎందుకు ఫ్లాప్ అయ్యిందంటే ఏమని సమాధామిస్తాం.కథ బాగాలేదు అంటాం, లేదంటే రొటీన్ గా ఉంది అంటాం.

 Akhil Flopped As There Was No Romance – Sayesha Saigal-TeluguStop.com

సినిమా పరిజ్ఞానం ఎక్కువుంటే స్క్రీన్ ప్లే లోటుపాట్లు చెబుతాం.కాని అఖిల్ ఫ్లాప్ అవడానికి మరో కారణం చెబుతోంది ఆ చిత్ర హీరోయిన్ సయేశ సైగల్.

ఈ భామ ఒక నేషనల్ దినపత్రికతో మాట్లాడుతూ ” అఖిల్ ఫ్లాప్ అవడానికి అందులో ఎమోషన్ లేకపోవడమే కారణం.నేను అఖిల్ జంటగా బాగున్నప్పటికీ, మా ఇద్దరి మధ్య కేమిస్త్రి లేదు.

మా మధ్య రోమాన్స్ ఉండాల్సింది.అఖిల్ నాకు చిత్రంలో ఐ లవ్ యు కుడా చెప్పలేదు.

మా మధ్య రోమాన్స్ లేకపోవడం చిత్రాన్ని దెబ్బతీసింది.మా కేమిట్రీ బాగుండుంటే యువత థియేటర్లకు వచ్చి సినిమా చూసేవారు.” అంటూ తన దృష్టిలోని కారణాలు బయటపెట్టింది సయేశ.

ఇక ఈ టీనేజ్ బ్యూటి ప్రస్తుతం అజయ్ దేవగన్ డ్రీం ప్రాజెక్ట్ శివాయ్ లో నటిస్తోంది.

ఈ విషయం పై స్పందిస్తూ ” అజయ్ సార్ తన డ్రీం ప్రాజెక్ట్ లో నన్ను హీరోయిన్ గా తీసుకోవడం చాలా సంతోషించే విషయం.ఈ చిత్ర ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు నేనే సెలెక్ట్ అవుతానని అనుకోలేదు.

కాని ఆదృష్టం నన్నే వరించింది.ఈ సినిమా మీద నేను చాలా ఆసక్తిగా ఉన్నాను ” అంటూ ముగించింది సయేశ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube