దేవుడా.. టాప్ 5 లో నన్ను పెట్టకపోతే చంపెయ్.. నటరాజ్ మాస్టర్ కు పిచ్చి ముదిరిందంటూ?

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది.బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంటుండడంతో కంటెస్టెంట్ ల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది.

 Akhil Big Shock To Nataraj , Nataraj Master , Bigg Boss Non Stop , Akhil , Bigg-TeluguStop.com

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు టాప్ ఫైవ్ లో నిలవడం కోసం నువ్వా నేనా అనే విధంగా పోటీ పడుతున్నారు.తాజాగా జరిగిన ఎపిసోడ్ లో నట్రాజ్ మాస్టర్ దండాలు పెడుతూ వింతగా ప్రవర్తించాడు.

దేవుడు ఉన్నాడు.దేవుడు చూస్తూ ఉన్నాడు అంటూ ఎప్పుడూ ఉండే రొటీన్ డైలాగ్‌నే చెప్పాడు.

ప్రాణం పోయేంత వరకూ ఆడతాను.నోరు తెరిచి అఖిల్‌ని అడిగాను.

నన్ను నాలుగో సారి మోసం చేశాడు అఖిల్.నేను ఓడిపోయే వ్యక్తిని కాదు అని బాబా భాస్కర్‌తో చెప్పి బాధపడ్డాడు నటరాజ్ మాస్టర్.

అప్పుడు అఖిల్.నేను గేమ్‌లో ఉండగానే.నాకు హెల్ప్ చేయమని నటరాజ్ మాస్టర్ అడిగారంటే.నేను ఓడిపోతానని ముందే ఆయన ఫిక్స్ కావడం నచ్చలేదు అని తెలిపాడు అఖిల్.

అంతేకాకుండా గేమ్‌లో కూడా నన్ను ఫట్ ఫట్ మని కొడుతూనే ఉన్నారు.అనీల్‌కి నేను హెల్ప్ చేద్దాం అనుకున్నా.

ఇప్పటివరకూ కుదర్లేదు.ఇప్పటికి కుదిరింది.

అందుకే చేశాను.ఆయనకి ఆశ ఎక్కువైపోయింది.

అంత ఆశ ఉండకూడదు.నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నా అని చెప్పుకొచ్చాడు అఖిల్.

ఇక తాజాగా జరిగిన టాస్క్ లో నటరాజ్ మాస్టర్ ఓడిపోవడంతో వింత వింతగా ప్రవర్తిస్తూ.బాధ తట్టుకోలేకపోతున్నా.

ఈ హౌస్‌లో ఎవరూ నాకు హెల్ప్ చేయరు.నన్ను చంపెయ్.

కనీసం ఆడియన్స్ ఓట్లను అడుక్కునే అవకాశం లేకుండా చేశావ్.ఆ అవకాశం కూడా లాగేసుకున్నావే.

Telugu Akhil, Anil, Baba Bhaskar, Bigg Boss, Nataraj Master, Top-Movie

ఇంకేమి చేస్తావ్.మెడపట్టి చంపెయ్.అంటూ ఆకాశంలోకి అరుస్తూ వింత వింతగా ప్రవర్తించాడు నటరాజ్ మాస్టర్.అతని వింత ప్రవర్తనకు హౌస్‌లో ఉన్నవాళ్లంతా షాక్ అయ్యారు.బాబా భాస్కర్ వచ్చి.ఏంట్రా నట్టా.

ఎవరితో మాట్లాడుతున్నావ్‌రా నట్టా.నీ గురించి తప్పుగా అనుకుంటార్రా అని చెప్తున్నా నటరాజ్ మాస్టర్ తగ్గలేదు.

నన్ను టాప్ 5కి తీసుకుని వెళ్లకపోతే చంపెయ్.నన్ను చంపెయ్.

నాకు సుఖం ఇచ్చేది ఎప్పుడు.నాకు హౌస్‌లో సపోర్ట్ రాదు.

ఆడియన్స్ సపోర్ట్ కోసం పరుగుపెడుతున్నాను.నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు.

నా కూతురు మొహం చూసి ఆడుతున్నా అంతే.నాకు హౌస్‌లో శత్రువులు ఎక్కువ.

నువ్వే కదా నాకు దిక్కు.నేనే ఇలాగే ఉంటా.

ఎన్నిసార్లు ఓడగొడతావో ఓడగొట్టు.నేను పోరాడుతూనే ఉంటాను.

చిన్న పాపని వదిలేసి వచ్చి ఉన్నాను.నేను సాధించాను.

టాప్ 5లో ఉన్నాను.గెలిచాను అని గర్వంగా చెప్పడానికి ఇక్కడకు వచ్చాను.

అంటూ ఎమోషనల్ అయ్యాడు నటరాజ్ మాస్టర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube