అఖిల్ మళ్ళీ లవ్ బ్రేకప్..!

టైటిల్ చూడగానే అక్కినేని హీరో అఖిల్ మళ్లీ తన లవ్ స్టోరీకి బ్రేకప్ చెప్పాడా అని అనుకోవచ్చు.అసలు వరుస సినిమాలతో బిజీగా ఉన్న అఖిల్ ప్రస్తుతం ఎవరితో ప్రేమలో లేడు.

 Akhil Another Love Breakup , Akhil , Akhil Sardhak , Akhil Updates, Akkineni Akh-TeluguStop.com

ఇండస్ట్రీలో అక్కినేని అఖిల్ కాకుండా మరో అఖిల్ ఉన్నాడు అతనే అఖిల్ సార్ధక్.బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ ఆ క్రేజ్ తో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.

రీసెంట్ గా జరిగిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అఖిల్ ఫైనల్స్ వరకు వచ్చాడు.

అయితే బిగ్ బాస్ సీజన్ 4లో అఖిల్ తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పాడు.

తనకు ఆల్రెడీ లవ్ బ్రేకప్ అయ్యిందని చెప్పాడు.అయితే హౌజ్ లో మోనాల్ గజ్జర్ తో బాగా దగ్గరయ్యాడు అఖిల్.

హౌజ్ లో వీరిద్దరి రచ్చ మాములుగా లేదు.ఇద్దరు బయటకు వచ్చాక కూడా ఆ రిలేషన్ ని కొనసాగించారు.

అఖిల్ ఎక్కడ ఉంటే అక్కడ మోనాల్ కనిపించింది.మోనాల్ తోనే అఖిల్ కూడా ఉంటూ వచ్చాడు.

వీరిద్దరి లవ్ దాదాపు బయట కూడా కన్ఫర్మ్ అనుకునే లోగా మళ్లీ ఏమైందో ఏమో ఈమధ్య అఖిల్, మోనాల్ లు కలిసి కనిపించడం లేదు.స్టార్ మా డ్యాన్స్ షోలో సందడి చేసిన మోనాల్ ఆ తర్వాత అడ్రెస్ లేకుండాపోయింది.

బిగ్ బాస్ వేడి మీద ఒకటి రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్ ఛాన్స్ రాగా అది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

Telugu Akhil, Akhil Sardhak, Akhil Ups, Akkineni Akhil, Biggboss Akhil, Tollywoo

ఇక లేటెస్ట్ గా అఖిల్ తన ఫ్యాన్స్ తో చేస్తున్న చిట్ చాట్ లో భాగంగా లవ్ స్టోరీ గురించి అడిగితే బ్రేకప్ అని రిప్లై ఇచ్చాడు.సో మళ్లీ అఖిల్ లవ్ బ్రేకప్ అయ్యిందని హడావిడి మొదలైంది.మరి అఖిల్ బ్రేకప్ చెప్పింది మోనాల్ విషయంలోనేనా లేక మరేదైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube