అక్కిల్ అక్కినేని 5వ సినిమా అధికారికంగా ప్రకటన వచ్చి నెలలు గడుస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ ముగిసినా విడుదలకు నోచుకోవడం లేదు.కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ సమయంలోనే అఖిల్ 5వ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా స్క్రిప్ట్ మొదటే పూర్తి అయినా కూడా కొన్ని మార్పులు చేర్పులు చెప్పి గత కొన్ని నెలలుగా షూటింగ్ వాయిదా వేస్తూ వచ్చారు.ఎట్టకేలకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందని యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు ప్రముఖ రచయితలు కలిసి రెడీ చేసిన ఈ స్క్రిప్ట్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను ఫిబ్రవరి నుండి మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నాడు.ఆ విషయమై ఇప్పుడు అందరు ఆసక్తిగా ఉన్నారు. అఖిల్ ను సురేందర్ రెడ్డి ఎలా చూపిస్తాడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.కనుక సురేందర్ రెడ్డి మరింత జాగ్రత్తలు తీసుకుని పక్కా స్క్రిప్ట్ ను రెడీ చేసి షూటింగ్ కు వెళ్లబోతున్నాడు.
ఇప్పటికే హీరోయిన్ విషయమై చర్చలు జరుగుతున్నాయి.ఆ హీరోయిన్ ఎవరు అనే విషయమై క్లారిటీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.
మరో వైపు షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు అఖిల్ కూడా రెడీ అవుతున్నాడని అక్కినేని ఫ్యామిలీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.