ఫ్లాప్ డైరెక్టర్ ఫ్లాప్ హీరో కాంబినేషన్.. హిట్ బ్యానర్! కాంబినేషన్ హిట్ అవుతుందా  

అఖిల్, బొమ్మరిలు భాస్కర్ మూవీ అఫీషియల్ కన్ఫర్మ్ద్. .

Akhil And Bommarillu Bhaskar Movie Confirmed-geeth Arts,movie Confirmed,telugu Cinema,tollywood

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో యాక్షన్, డాన్స్ లలో తన సత్తా చాటిన అఖిల్ కి బ్యాడ్ లుక్ నెత్తి మీద కూర్చుంది. దీంతో అతను చేసిన మూడు సినిమాలు కూడా థియేటర్ లో ప్రేక్షకుల ముందు చేదు ఫలితాన్నే అందుకున్నాయి. మొదటి సినిమాలో ఓవర్ చేసాడని కామెంట్స్ వినిపించిన, రెండో సినిమాలో అనవసరమైన యాక్షన్ ఎక్కువైపోయింది అని విమర్శలు వచ్చిన మూడో ప్రయత్నం మాత్రం ఎలాంటి అతి లేకుండా రొమాంటిక్ లవ్ స్టొరీతో వచ్చాడు..

ఫ్లాప్ డైరెక్టర్ ఫ్లాప్ హీరో కాంబినేషన్.. హిట్ బ్యానర్! కాంబినేషన్ హిట్ అవుతుందా-Akhil And Bommarillu Bhaskar Movie Confirmed

అయితే అది కూడా తెలుగు ఆడియన్స్ ని నచ్చలేదు. దర్శకుడు మొదటి సినిమా కథనే దేశం మార్చేసి తీసాడని విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ తన నాలుగో సినిమాకి రెడీ అవుతున్నాడు.

కెరియర్ ఆరంభంలో అదిరిపోయే హిట్స్ రెండు అందుకొని తరువాత ఆరెంజ్ లో క్రిందకి పడిపోయిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ మూవీ కన్ఫర్మ్ చేసాడు. ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ నిర్మించడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయిన ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

మరి అసలే ఫ్లాప్ లతో ఉన్న హీరో మళ్ళీ ఫ్లాప్ దర్శకుడుతో అంటే ఎంత వర్క్ ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తిగా ఉంది. అయితే గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కాబట్టి కొద్ది ఆలోచించొచ్చు అని ఇప్పుడు ఆడియన్స్ అనుకుంటున్నారు.