చైతు కొట్టేశాడు.. అఖిల్ ఖాతా తెరుస్తాడా..?

అక్కినేని హీరోల్లో నాగ చైతన్య ఇప్పుడు మంచి ఫాం లో ఉన్నాడని చెప్పొచ్చు.మజిలీ.

 Akhil All Hopes On Meb Movie, Pooja Hegde,akhil Akkineni, Naga Chaitaya, Love St-TeluguStop.com

వెంకీమామతో పాటుగా రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నాగ చైతన్య.చైతు కెరియర్ ను ఎలాగోలా సెట్ చేసిన నాగార్జున అఖిల్ విషయంలో మాత్రం అసంతృప్తిగా ఉన్నాడని చెప్పొచ్చు.

మూడు సినిమాలు చేసిన అఖిల్ ఇప్పటివరకు హిట్ ఖాతా తెరవలేదు.అఖిల్ నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీదనే మొత్తం అంచనాలు పెట్టుకున్నారు.

చైతు సినిమాకు మినిమం గ్యారెంటీ అన్న టాక్ వచ్చేసింది.ఇక ఇప్పుడు చైతు కథలు సరిగా ఎంచుకుంటే అతను మంచి ఫాం కొనసాగించే అవకాశం ఉంది.

అయితే అఖిల్ విషయంలో అది క్లారిటీ రాలేదు.తీసిన 3 సినిమాల్లో మాస్, క్లాస్ ఇలా ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు.

ప్రస్తుతం రాబోతున్న బ్యాచిలర్ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు అఖిల్.తప్పకుండా సినిమా అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో పూజా హెగ్దే అందాలు కూడా హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి.మరి బ్యాచిలర్ సినిమాతో అఖిల్ హిట్ ఖాతా తెరుస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube