అఖిల్ ఏజెంట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. అప్పుడే లేనట్టేనా?

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా హిట్ ఇచ్చిన ఆనందంతో అఖిల్ మరొక సినిమా స్టార్ట్ చేసాడు.

 Akhil Akkineni's Agent Movie Will Be Postponed, Akhil Akkineni, Agent Movie, Anil Sunkara, Surender Reddy, Sakshi Vaidya, Agent Movie Postponed-TeluguStop.com

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఏజెంట్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.బ్యాచిలర్ సినిమాలో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.

అందుకే ఈ సినిమా కూడా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.అయితే ఈ సినిమా గురించి ఒక వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఈ సినిమా గత ఏడాది నుండి కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.దీంతో ముందు అనుకున్న డేట్స్ అన్ని తారుమారు అయ్యాయి.

అందుకే ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ చేస్తామని చెప్పినా కూడా ఇప్పుడు అది అయ్యేలా కనిపించడం లేదు.షూటింగ్ ఇంకా ఆలస్యం అవ్వడం వల్ల ఇప్పుడు చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ మార్చబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇటీవలే హీరోయిన్ సాక్షి వైద్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ పై వేయలేదు.దీంతో ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ అవ్వడం కష్టమేమో అని అంటున్నారు.

ఈ సినిమా ఆగష్టులో కాకూండా సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అంటూ యూనిట్ సభ్యుల నుండే వార్తలు వస్తున్నాయి.షూటింగ్ ఆలస్యం తో పాటు మరికొన్ని అవాంతరాల కారణంగా ఈ సినిమా ఆలస్యం కానుందట.

దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.మరి రిలీజ్ ఎప్పటికి పోస్ట్ ఫోన్ చేస్తారో వేచి చూడాలి.

ఇక ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా మలయాళ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube