అఖిల్ లుక్ చూసారా.. ఏజెంట్ కోసం ఇంతలా మారిపోయాడా?

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా హిట్ ఇచ్చిన ఆనందంతో అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా స్టార్ట్ చేసాడు.

 Akhil Akkineni Agent Movie Latest Look Reveal Details, Manali, Latest Look, Akhil Akkineni, Agent Movie, Anil Sunkara, Surender Reddy, Sakshi Vaidya, Akhil Agent Look, Akhil Mass Look, Agent Movie Shooting-TeluguStop.com

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

బ్యాచిలర్ సినిమాలో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.

 Akhil Akkineni Agent Movie Latest Look Reveal Details, Manali, Latest Look, Akhil Akkineni, Agent Movie, Anil Sunkara, Surender Reddy, Sakshi Vaidya, Akhil Agent Look, Akhil Mass Look, Agent Movie Shooting-అఖిల్ లుక్ చూసారా.. ఏజెంట్ కోసం ఇంతలా మారిపోయాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ఈ సినిమా కూడా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.

అయితే ఈ సినిమా గురించి ఒక వార్త ఇప్పుడు చిత్ర యూనిట్ తెలిపారు.ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం మనాలీ వెళ్లిన విషయం తెలిసిందే.ఇక్కడే హై యాక్టెన్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం టీమ్ అంతా మనాలీ లోకి ఇటీవలే అడుగు పెట్టారు.ఈ సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ నే హైలెట్ కానున్నాయట.

అందుకే ఈ సీక్వెన్స్ కోసం చిత్ర యూనిట్ తో పాటు అఖిల్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఏకే ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో మమ్ముట్టి విలన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయినా అఖిల్ స్టైలిష్ లుక్ లో కండలు తిరిగిన శరీరంతో ఆకట్టు కుంటున్నాడు.

తాజాగా ఈ సినిమా నుండి అఖిల్ లుక్ ఒకటి బయటకు వచ్చింది.సెట్స్ నుండి బయటకు వచ్చిన ఈ ఫొటోల్లో అఖిల్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతుండగా షూట్ మూడ్ లో ఉన్న అఖిల్ ఫోటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.అలాగే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు.ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అఖిల్ ఈ సినిమా కోసం ఇంతలా మారిపోయాడా అని ఆశ్చర్య పోతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube