Akhil Akkineni : నాకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలే ఇష్టం.. అఖిల్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) తాజాగా నటించిన చిత్రం ఏజెంట్.సురేందర్ రెడ్డి( Surender Reddy ) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Akhil Akkineni Talks About Agent Movie With Media-TeluguStop.com

ఈ సందర్భంగా అఖిల్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నాడు.అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా( Agent movie ) పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ నిజంగా అఖిల్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పర్సనల్ విషయాల గురించి ఫ్యామిలీ విషయాల గురించి కెరియర్ గురించి అలాగే సినిమా గురించి పంచుకున్నారు అఖిల్.

Telugu Akhil, Surender Reddy, Tollywood-Movie

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.నాకు లార్జర్ దేన్ లైఫ్, యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేస్తున్నప్పుడు నాకు ఎక్కడో చిన్న వెలితి.ఆ సినిమా చాలా మంచి విజయం సాధించింది.నాకు యాక్సెప్టెన్స్ చాలా వరకు పెరిగింది.అయితే పర్సనల్‌గా నాకు ఇష్టమైన జోనర్ యాక్షన్.

లాక్‌డౌన్ సమయంలో ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి‌ని కలిశాను.అప్పటికి ఈ సినిమా కథ ఇంకా తెలీదు.

ఒక కొత్త తరహా యాక్షన్ సినిమా చేసి ఫ్రెష్ కంటెంట్‌ని ఇవ్వాలనే ప్రయత్నంతో స్పై జోనర్‌ని ఎంపిక చేసుకొని ఏజెంట్ సినిమా జర్నీ ని మొదలుపెట్టాను.నాకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలే ఇష్టం.

Telugu Akhil, Surender Reddy, Tollywood-Movie

ఇక రాజమౌళి గారి సినిమాలు అంటే పిచ్చి అని తెలిపారు అఖిల్.ఏజెంట్ జోనర్ నాకు బాగా నచ్చింది.ఇంత క్రేజీగా చేయగలుగుతానా లేదా అనేది డౌట్.ఎందుకంటే ఇంతకు ముందు అలాంటిది చేయలేదు.కాబట్టి ఈ పాత్ర కోతిలానే బిహేవ్ చేస్తుంది.ప్రతి క్షణం ఒక హైలో మాట్లాడాలి.అది నాకు చాలా కష్టంగా అనిపించింది.ఎందుకంటే వ్యక్తిగతంగా నేను కొంచెం సిగ్గరి.అయితే కొంత జర్నీ తర్వాత ఆ పాత్రకు అలవాటు పడిపోయాను అని చెప్పుకొచ్చారు అఖిల్.అఖిల్ కెరియర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితం అవ్వడంతోపాటు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కబోతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube