అఖిల్‌ది కూడా నాన్చుడు ధోరణియేనా?  

Akhil Not Finalizing Surender Reddy, Akhil Akkineni, Surender Reddy, Tollywood News, Most Eligible Bachelor - Telugu Akhil Akkineni, Most Eligible Bachelor, Surender Reddy, Tollywood News

యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మిగులుతుండటంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.అయితే ఈసారి ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకోవాలనే కసితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ హీరో.

TeluguStop.com - Akhil Akkineni Surender Reddy Most Eligible Bachelor Bommarillu Baskar

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తుండటంతో చిత్ర వర్గాల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

TeluguStop.com - అఖిల్‌ది కూడా నాన్చుడు ధోరణియేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా సక్సెస్ చిత్రాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నానా కష్టాలు పడుతున్నాడు.

ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చుట్టూ తిరిగిన ఈ డైరెక్టర్, ఇటీవల అఖిల్ దగ్గరకు చేరుకున్నాడు.తన నెక్ట్స్ చిత్రానికి సంబంధించిన కథను అఖిల్‌కు వినిపించాడట.అయితే కథను విన్న అఖిత్ తన రెస్పాన్స్ ఏమిటనేది మాత్రం చెప్పలేదట.దీంతో అఖిల్ తన నిర్ణయాన్ని చెప్పకుండా ఇలా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నాడని సురేందర్ రెడ్డి ఫీల్ అవుతున్నాడట.

ఇప్పటికే తాను చాలా వెనకబడిపోయానని, తన నెక్ట్స్ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సురేందర్ రెడ్డి చూస్తున్నాడు.మరి అఖిల్ తన నిర్ణయం ఏమిటో చెబితే సురేందర్ రెడ్డి దాని ప్రకారం తన భవిష్యత్ ప్రణాళిక రచించుకుంటాడని, అఖిల్ ఇలాంటి నాన్చుడు ధోరణి మానుకోవాలని పులువురు ఆయనకు సూచిస్తున్నారు.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ చిత్రంలో అఖిల్ సరసన స్టార్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే.

#Surender Reddy #Akhil Akkineni #MostEligible

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akhil Akkineni Surender Reddy Most Eligible Bachelor Bommarillu Baskar Related Telugu News,Photos/Pics,Images..