అఖిల్‌ మళ్లీ ట్విస్ట్‌ ఇచ్చాడు.. నందమూరి ఫ్యాన్స్‌ ఆందోళన  

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి రెండు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. దాంతో ప్రస్తుతం చేస్తున్న మూడవ సినిమా అయినా ఆకట్టుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్‌ మూడవ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, నిధి అగార్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విడుదల ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను మొదట డిసెంబర్‌లో అనుకున్నారు. కాని డిసెంబర్‌లో పెద్ద సినిమాలు విడుదల ఉన్నాయని జనవరిలో విడుదల చేయాలని భావించారు.

Akhil Akkineni Movie Release Date Is Fixd For This Januari-

Akhil Akkineni Movie Release Date Is Fixd For This Januari

జనవరిలో విడుదల అనుకున్న సమయంలోనే ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు కూడా రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో అఖిల్‌ మూవీ ‘మిస్టర్‌’ మజ్ను ప్రేమికుల దినోత్సవం సందర్బంగా విడుదల కాబోతుందని అంతా అనుకున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా పెద్దగా పోటీ కూడా ఏమీ ఉండదని అనుకుంటున్నారు. అయితే తాజాగా దీపావళి లుక్‌ లో ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Akhil Akkineni Movie Release Date Is Fixd For This Januari-

తాజా పోస్టర్‌ లో ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రం విడుదల తేదీ విషయంపై ట్వీస్ట్‌ రావడం అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తోంది. ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాన్ని ఎందుకు జనవరిలో విడుదల చేస్తున్నారా అనే చర్చతో పాటు, జనవరిలో ఏ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతుంది. సంక్రాంతికి చరణ్‌ మూవీ వినయ విధేయ రామ చిత్రంతో పాటు ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’ విడుదల కాబోతుంది. సంక్రాంతికి అఖిల్‌కు స్కోప్‌ లేదు. రిపబ్లిక్‌ డే కు ఎన్టీఆర్‌ మహానాయకుడు మరో రెండు చిత్రాలు రాబోతున్నాయి. కనుక రిపబ్లిక్‌ డేకు రావడం కన్ఫర్మ్‌ అంటున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్‌ అఖిల్‌ మూవీ వల్ల ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ ఎఫెక్ట్‌ అవుతాడేమో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.