బ్యాచ్‌లర్‌పై నాగ్ అసంతృప్తి.. అంతలేదన్న భాస్కర్!

అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం వేసవి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది.కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ కొంచెం మిగిలిపోయింది.

 Bhasker Denies Rumours On Most Eligible Bachelor, Akhil Akkineni, Most Eligible-TeluguStop.com

కాగా ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది.

అయితే ఈ సినిమా ఔట్‌పుట్‌ను అక్కినేని నాగార్జున చూశాడని, ఆయనకు సినిమా రషెస్ పెద్దగా నచ్చలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.బొమ్మరిల్లు భాస్కర్ అనుకున్న స్థాయిలో సినిమాను తెరకెక్కించలేదని, సినిమాలో కొన్ని సీన్స్ రీ-షూట్ చేయాలని నాగ్ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని భాస్కర్ తేల్చేశాడు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం అనుకున్నట్లుగానే చాలా బాగా వచ్చిందని, చిత్ర యూనిట్ ఈ సినిమా ఔట్‌పుట్‌తో చాలా సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపాడు.

భాస్కర్ పనితనం పట్ల నాగ్ చాలా సంతోషంగా ఉన్నాడట.సినిమాను చాలా పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దడంలో భాస్కర్ తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నట్లు నాగ్ కితాబిచ్చాడు.

ఇక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాను చాలా వైవిధ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు భాస్కర్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.ఈ సినిమాతో అటు అఖిల్, ఇటు భాస్కర్ ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube