ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు హీరోలెవరో చెప్పుకోండి చూద్దాం..?

టాలీవుడ్ సినీ పరిశ్రమలో యంగ్ హీరో నాగ చైతన్య అలాగే రానా దగ్గుబాటి హీరోలకు ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఇందులో రానా దగ్గుబాటి ఇప్పటికే బాహుబలి చిత్రంలో విలన్ పాత్ర పోషించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

 Telugu Heros Rana Daggubati And Akkineni Naga Chaitanya Childhood Photos Viral In Social Media-TeluguStop.com

 అలాగే నాగచైతన్య కూడా ప్రస్తుతం హీరోగా బాగానే రాణిస్తున్నాడు.

అయితే తాజాగా ఈ ఇద్దరికీ సంబంధించినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

 Telugu Heros Rana Daggubati And Akkineni Naga Chaitanya Childhood Photos Viral In Social Media-ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు హీరోలెవరో చెప్పుకోండి చూద్దాం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 ఆ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు రానా దగ్గుబాటి మరియు నాగచైతన్య కలిసి తీయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ బావ బామ్మర్దులు కావడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో వీరిద్దరి అభిమానులు ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు.

అంతేగాక దగ్గుబాటి బావతో అక్కినేని చిన్నోడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న  “లవ్ స్టోరీ” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

కాగా రానా దగ్గుబాటి తెలుగులో విరాటపర్వం అనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అంతేగాక ఇంతకు ముందే రానా దగ్గుబాటి నటించినటువంటి “అరణ్య” అనే చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

#Rana Daggubati #@RanaDaggubati #AkkineniNaga #@chay_akkineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు