థ్రిల్లింగ్ వీడియోతో 'ఏజెంట్'.. మహేష్ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న అఖిల్!

అక్కినేని నాగార్జున వారసుడిగా వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు అఖిల్ అక్కినేని. బ్యాచిలర్ వంటి హిట్ తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ”ఏజెంట్” సినిమా చేస్తున్నాడు.

 Akhil Akkineni Agent Release Date Announcement Details, Akhil Akkineni, Agent Mo-TeluguStop.com

ఈ సినిమా స్టార్ట్ చేసి దాదాపు రెండేళ్లు అవుతుంది.ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలెట్టాడో తెలియదు కానీ వరుసగా వాయిదా పడుతూ వస్తుంది.

శరవేగంగా షూట్ జరుగుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ పై ఇంత వరకు అయితే బజ్ క్రియేట్ అవ్వలేదు.

ఎందుకంటే ఈ సినిమా నుండి సురేందర్ రెడ్డి ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు.

ఒకటి రెండు పోస్టర్స్ వచ్చిన కూడా ఇవి బజ్ మాత్రం మరింతగా క్రియేట్ చేయలేక పోయాయి అనే చెప్పాలి.అయితే తాజాగా ఈ రోజు అక్కినేని ఫ్యాన్స్ కు సురేందర్ రెడ్డి సర్ప్రైజ్ ఇచ్చాడు.

భారీ స్పై యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా రిలీజ్ డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఫైనల్ గా ఒక స్టన్నింగ్ వీడియోతో మేకర్స్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

Telugu Akhil, Akhil Akkineni, Surender Reddy, Mahesh Babu, Mammootty, Sakshi Vai

ఇలా ఒకేసారి రెండు సర్ప్రైజ్ లు రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఈ వీడియోలో అఖిల్ తన మేకోవర్ తో మాత్రమే కాదు నటనతో కూడా మెప్పించాడు.అంతేకాదు అఖిల్ తన వంటి మీద బట్టలు లేకుండా నటించి నటన కోసం ఎంత వరకు అయినా వెళ్తాను అని నిరూపించాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 28న లాక్ చేసారు.ఇది మహేష్ సినిమా రిలీజ్ డేట్.కానీ మహేష్ పోస్ట్ పోన్ చేసుకోవడంతో ఏజెంట్ గా అఖిల్ రాబోతున్నాడు.

Telugu Akhil, Akhil Akkineni, Surender Reddy, Mahesh Babu, Mammootty, Sakshi Vai

ఇక ఏజెంట్ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించ నుండగా.ఈయనకు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు.అలాగే హిప్ హప్ తమిళ్ సంగీతాన్ని అందిస్తుండగా రసూల్ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube