ఏజెంట్ గా మారిన అఖిల్.. ఫస్ట్ లుక్ అదుర్స్..!

అక్కినేని అఖిల్ ఐదవ సినిమాగా వస్తున్న ప్రాజెక్ట్ కు టైటిల్ ఫిక్స్ చేశారు.సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ అక్కినేని హీరోగా అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 Akhil Akkineni Agent First Look Released-TeluguStop.com

ఈ సినిమాకు ఏజెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు.సినిమాలో అఖిల్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నట్టు ఉన్నారు.

ఇన్నాళ్లు లవర్ బోయ్ గా కనిపించిన అఖిల్ ఈసారి మాస్ అటెంప్ట్ చేస్తున్నాడు.ప్రస్తుతం అఖిల్ 4వ సినిమా బ్యాచ్ లర్ రిలీజ్ కు రెడీ అవుతుంది.

 Akhil Akkineni Agent First Look Released-ఏజెంట్ గా మారిన అఖిల్.. ఫస్ట్ లుక్ అదుర్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ సెట్స్ మీదకు వెళ్తుంది.

ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ మూవీ నిర్మిస్తున్నారు.

అక్కినేని అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఏజెంట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.సైరా నరసిం హా రెడ్డి తర్వాత అఖిల్ చేస్తున్న ఈ సినిమాపై చాలా హోప్స్ ఉన్నాయి.

ఏజెంట్ గా అఖిల్ లుక్ అదిరిపోయిందని చెప్పొచ్చు.ఈ సినిమా హాలీవుడ్ మూవీ బార్న్ ఐడెంటిటీకి రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి.

సినిమాతో అఖిల్ మాస్ ఆడియెన్స్ ను కూడా మెప్పించాలని చూస్తున్నాడు.ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

#Surendar Reddy #Akhil Akkineni #AkhilAkkineni #AkhilBirthday #First Look

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు