అఖిల్‌ మొదటి సినిమా స్టైల్‌ లో మరోటి

అక్కినేని అఖిల్‌ మొదటి మూడు సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పర్చాయి. రామ్‌ చరణ్‌ స్థాయిలో స్టార్‌ డం దక్కించుకుంటాడు అంటూ అక్కినేని అభిమానులు అఖిల్‌పై ఆశలు పెట్టుకుంటే ఆయన మాత్రం తీవ్రంగా నిరాశ పర్చాడు.

 Akhil Akkineni 5th Film Is Like His First Film Only Under The Direction Surendar-TeluguStop.com

మొదటి సినిమా అఖిల్‌ భారీ బడ్జెట్‌ తో వివి వినాయక్‌ దర్శకత్వంలో రూపొందింది.ఆ సినిమా ఫాంటసీ కథతో రూపొందిన విషయం తెల్సిందే.

అఖిల్‌ బాడీ లాంగ్వేజ్‌ మరియు ఇమేజ్‌కు ఆ కథ అస్సలు సెట్‌ అవ్వలేదు.భారీ యాక్షన్‌ సీన్స్‌ ఉన్నా కూడా ప్రేక్షకులు సినిమాను ఆదరించలేదు.

ఎందుకంటే కథ అంతగా ప్రేక్షకులకు కనెక్ట్‌ అవ్వలేదు.ఆ సినిమా ప్రభావం నుండి అఖిల్‌ ఇంకా కూడా బయట పడలేక పోతున్నాడు.

ఇలాంటి సమయంలో మళ్లీ అఖిల్‌ అలాంటి కథనే ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.త్వరలో అఖిల్‌ చేయబోతున్న సినిమా కథ ఫాంటసీ అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

Telugu Akhil, Akkineni Akhil, Nagarjuna-Latest News - Telugu

ప్రస్తుతం అఖిల్‌ అక్కినేని

‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’

సినిమాలో నటిస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసింది.బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ఒకటి రెండు వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది.ఇదే సమయంలో అఖిల్‌ తదుపరి సినిమా విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అఖిల్‌ 5 సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు అనేది అందరికి తెలిసిన విషయమే.వీరి కాంబో కోసం వక్కంతం వంశీ ఒక మాంచి ఫాంటసీ కథను తయారు చేశాడట.

సూరీ అనుకున్న స్టోరీ లైన్‌ ను వంశీ అద్బుతంగా రెడీ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొందరు మాత్రం ముఖ్యంగా అక్కినేని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా మళ్లీ ‘అఖిల్‌’ ఫలితాన్ని రిపీట్‌ చేయదు కదా అంటూ అనుమానంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube