వైజాగ్ పోర్ట్ చుట్టేసిన ఏజెంట్..తర్వాత పయనం ఎటో!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

 Akhil Agent Movie Next Schedule In Europe Budapest, Europe, Akhil, Budapest, Sur-TeluguStop.com

ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో భారీ యాక్షన్ చేజింగ్ సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ ఒక్క లుక్ తోనే అఖిల్ ఈ సినిమా కోసం ఎంతగా మారిపోయాడో తెలుస్తుంది.

ఈ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ప్రెసెంట్ వైజాగ్ పోర్ట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఇక్క భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించాడు.

ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇక దాదాపు వైజాగ్ షెడ్యూల్ కూడా పూర్తి కాబోతుంది.ఈ సినిమాలో ప్రధానంగా హానీ ట్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతోందని ఇది ఒక స్పై త్రిల్లర్ అని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.ఇక వైజాగ్ లో కూడా షూటింగ్ ముగిసిన తర్వాత ఏజెంట్ నెక్స్ట్ ఎటు పయనం అవుతాడో అనే విషయంపై వార్తలు వస్తున్నాయి.

Telugu Akhil, Akhilschedule, Budapest, Europe, Vizag, Surender Reddy, Vizag Port

ఇక వైజాగ్ షెడ్యూల్ పూర్తి అయినా తర్వాత ఏజెంట్ చిత్ర యూనిట్ మొత్తం విదేశాలకు పయనం అవుతున్నట్టు సమాచారం.అక్టోబర్ లో చిత్ర యూనిట్ యూరప్ లోని బుడాపెస్ట్ లో షూటింగ్ జరుకోనుందని టాక్ వినిపిస్తుంది.అక్కడి షెడ్యూల్ పూర్తి అయినా తర్వాత చిత్ర యూనిట్ మళ్ళీ హైదరాబాద్ చేరుకొని ఇక్కడ బ్యాలెన్స్ షూట్ చేయనున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

దాదాపు 40 కోట్లకు పైగానే ఈ సినిమా కోసం ఖర్చు చేశారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube