అక్కినేని అఖిల్ ( Akhil )హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఏజెంట్.స్పై థ్రిల్లర్ కథతో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్యా హీరోయిన్ గా నటించగా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి( Mammootty ) నటిస్తున్నారు.
సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుండగా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.అయితే అఖిల్ ఏజెంట్ లో మమ్ముట్టి ప్రధాన పాత్ర అయినప్పుడు ఆయన కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటే బాగుండేదని అంటున్నారు.
కానీ ఇప్పటి వరకు మమ్ముట్టి ఈ సినిమా కోసం రాలేదు.
అసలు వస్తారా రారా అన్నది కూడా తెలియదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ లో చేస్తున్నారు.మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా మమ్ముట్టి వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఆయన లేకుండా సినిమా ప్రమోషన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.మమ్ముట్టి సినిమాలో బలమైన పాత్ర చేసినప్పుడు ఆయన కూడా సినిమా గురించి మాట్లాడితే సినిమాకు హెల్ప్ అవుతుందని అంటున్నారు.
ఇక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అనుకున్న ఏజెంట్( agent ) హిందీ వర్షన్ మాత్రం తర్వాత రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.