అఖిల్ విషయంలో ఆలస్యం అమృతమా? విషమా?

అక్కినేని అఖిల్ మొదటి మూడు సినిమాలు కూడా నిరాశ పర్చాయి.ఆయన మొదటి సినిమా అఖిల్‌ నుండి మొదలుకుని ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు ఆలస్యం ఆలస్యం అవుతూనే ఉంది.

 Akhil 5th Movie Also Getting Very Late , Akhil Akkineni, Most Eligible Bachelor,-TeluguStop.com

ఎన్నో సినిమాలు అనుకున్న సమయంకు వచ్చేశాయి.కాని అఖిల్‌ నటించిన సినిమాలు మాత్రం మూడు కూడా అనుకున్న సమయంలో రాలేదు అనేది అభిమానులు కూడా ఒప్పుకునే మాట.ఇక ప్రస్తుతం అఖిల్‌ 4 మూవీ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ కూడా ఖచ్చితంగా ఆలస్యం అయ్యింది ఇంకా అవుతూనే ఉంది.గత ఏడాది ఆరంభంలోనే సినిమా రావాల్సి ఉంది.

కరోనా కారణంగా 2020 మొత్తం వదిలేశారు. 2021 ఆరంభంలో అయినా విడుదల చేస్తారా అంటే ఇంకా ఏదో కట్టింగ్ లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బ్యాచిలర్ సినిమాకు మంచి బజ్ ఉంది.ఇలాంటి సమయంలో సినిమాను ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తే పరిస్థితి ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Akhil, Akhil Akkineni, Akhil Fans, Akhileligible, Akkineni Fans, Surendar

మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా విడుదల అయిన తర్వాత సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో సినిమాను ప్లాన్‌ చేశారు.అది కూడా ఆలస్యం అవుతూ వస్తోంది.సూరి దర్శకత్వంలో అఖిల్‌ మూవీ ప్రకటన వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్‌ డేట్ లేదు.షూటింగ్ లతో యంగ్‌ హీరోలు బిజీ బిజీగా ఉంటే వీళ్లు మాత్రం మరీ ఇలా ఏంట్రా బాబో అన్నట్లుగా నాన్చుతూ వస్తున్నారు.

వరుసగా రికార్డుల వర్షం కురవడం ఖాయం అన్నట్లుగా అఖిల్‌ అభిమానులు భావిస్తున్నారు.కాని ఆలస్యం అవ్వడం వల్ల ఆసక్తి తగ్గుతుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలంటే హడావుడిగా రావాలి.అంతే తప్ప ఆలస్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా విషం అవుతుంది.

చాలా తక్కువ సందర్బాల్లో మాత్రమే ఇండస్ట్రీలో ఆలస్యం అనేది అమృతం అవుతుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube