ఎట్టకేలకు మొదలైన అఖిల్‌4.. ఇదిగో పూర్తి అప్‌డేట్స్‌  

Akhil 4 With Director Bommarillu Bhaskar-

అఖిల్‌ అక్కినేని ఇండస్ట్రీకి పరిచయం అయ్యి సంవత్సరాలు గడుస్తున్నాయి.మూడు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.కాని వాటిలో ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసి పెట్టలేదు...

Akhil 4 With Director Bommarillu Bhaskar--Akhil 4 With Director Bommarillu Bhaskar-

అఖిల్‌కు మంచి స్టార్‌ డం ఉంది కాని దాన్ని వినియోగించుకుని సక్సెస్‌ అవ్వడంలో అఖిల్‌ విఫలం అవుతున్నాడు.సినిమాల్లోకి రాకుండానే స్టార్‌ స్టేటస్‌ను దక్కించుకున్న అఖిల్‌ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల కారణంగా అతడు విఫలం అవుతూ వచ్చాడు.

Akhil 4 With Director Bommarillu Bhaskar--Akhil 4 With Director Bommarillu Bhaskar-

ఇప్పటికే మూడు సినిమాలు విఫలం అయ్యాయి.ఇప్పుడు నాల్గవ సినిమాను అల్లు అరవింద్‌ బ్యానర్‌లో చేసేందుకు సిద్దం అయ్యాడు.

అల్లు అరవింద్‌ బ్యానర్‌ అంటే మంచి సినిమా వస్తుందని అంతా ఆశిస్తున్నారు.కాని దీనికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం అనగానే కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ సినిమా ఏమవుతుందో అనే అనుమానాలున్నాయి..

దాదాపు ఆరు నెలలుగా అదుగో ఇదుగో అంటూ జరుపుతూ వచ్చిన అఖిల్‌ 4వ సినిమా ఎట్టకేలకు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

అఖిల్‌ 4వ సినిమాను క్లాప్‌ కొట్టి ప్రారంభించారు.త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభించబోతున్నారు.బొమ్మరిల్లుతో అద్బుత విజయాన్ని సొంతం చేసుకున్న భాస్కర్‌ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో సినిమాలు చేయలేక పోయాడు.అయినా కూడా ఈయనపై నమ్మకంతో నాగార్జున మరియు అల్లు అరవింద్‌లు అఖిల్‌ను ఆయన చేతిలో పెట్టడం జరిగింది.

ఇంకా ఈ చిత్రంకు సంబంధించిన హీరోయిన్స్‌ ఫైనల్‌ అయినట్లుగా లేరు.అందుకే పూజా కార్యక్రమంలో ఎవరు హాజరు కాలేదు.త్వరలోనే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది...

ఆ సమయంలో సినిమాలో హీరోయిన్స్‌ ఎవరు అనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఈ చిత్రంను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని బొమ్మరిల్లు భాస్కర్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.