ఆకాశం నీ హద్దురా టీజర్ టాక్... గెలుపు కోసం పరుగు

సౌత్ స్టార్ హీరో సూర్య హీరోగా, సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆకాశం నీ హద్దురా… తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా.ఇక ఒక లక్ష్యం పెట్టుకొని ఎదగాలని ప్రయత్నం చేసే వ్యక్తి పాత్రలో ఇందులో సూర్య నటిస్తున్నాడు.

 Akhasam Ni Haddu Raa Teaser Talk-TeluguStop.com

ఓ విధంగా చెప్పాలంటే పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని ఎదిగే ప్రతి ఒక్కరి జీవితానికి ఈ పాత్ర కనెక్ట్ అవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబందించిన టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఇక ఈ టీజర్ కాస్తా మొటివేటింగ్ గా ఉంది.

జేబులో ఆరువేలు పెట్టుకుని ఏరో ప్లెయిన్ కంపెనీ పెడ‌దామ‌ని ఒక‌డొస్తే, ఎవ‌డ్రా ఈ వీపీగాడు అని ఈ లోకం వాడ్ని చూసి న‌వ్వింది అంటూ మోహ‌న్‌బాబు డైలాగ్‌తో ఈ టీజ‌ర్ మొద‌లైంది.

పైలెట్ ఆఫీస‌ర్ చంద్ర‌మ‌హేష్‌గా ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్నాడు ఇక విమానయాన కంపెనీ పెట్టాలని ఉద్యోగాన్ని వదిలేసి తన లైఫ్ లో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ సాగే పాత్రలో సూర్య‌ కనిపించాడు.ఇక తన లక్ష్యాలతో విజ‌యం వైపు ఎలా ప‌రుగులు తీశాడు అనే ఎలిమెంట్ ని దర్శకురాలు సుధ కొంగర చాలా నేచురల్గా సహజత్వానికి దగ్గరగా ఉండే విధంగా ఆవిష్కరించింది.

ఓ విధంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని దగ్గరగా చూపిస్తున్న ఫీలింగ్ కలిగింది.ఇక ఈ సినిమాని ఇదే పంథాలో తెరపై ఆవిష్కరిస్తే నేటి యువ‌త‌రానికి ఓ వ్య‌క్తిత్వ వికాస పాఠంగా మారే అవకాశం ఉంది.

మరి వరుస ఫ్లాప్స్ తో ఉన్న సూర్యకి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube