బాలయ్యను కలవాలనుకుంటున్నారా? అయితే ఇదే అవకాశం!

టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ ఇటీవల అఖండ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే.అయితే చాలా కాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న బాలయ్యకు బోయపాటి శ్రీను లెజెండ్, సింహా లాంటి భారీ హిట్ సినిమాలను అందించాడు.

 Akhandaroaronhotstar Great Opportunity To Balakrishna Fans, Tollywood, Akhanda, Balakrishna, Great Opportunity-TeluguStop.com

ఆ తర్వాత ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో అఖండ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.అంతేకాకుండా ఊహించని విధంగా కేరళ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

 Akhandaroaronhotstar Great Opportunity To Balakrishna Fans, Tollywood, Akhanda, Balakrishna, Great Opportunity-బాలయ్యను కలవాలనుకుంటున్నారా అయితే ఇదే అవకాశం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ఇలా ఉంటే అఖండ సినిమా జనవరి 21 నుంచి డిజిటల్లో స్ట్రీమింగ్ అవుతోంది.అఖండ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ అత్యధిక ధరకు సొంతం చేసుకుంది.

దీనిని తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేశారు.నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్త్రీమింగ్ అయ్యింది.

ఈ క్రమంలోనే సదరు ఓటీటీ సంస్థ బాలయ్య అభిమానులకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది.అదేమిటంటే బాలకృష్ణ అభిమానులు బాలయ్యను కలుసుకునే అవకాశాన్ని కల్పించింది.ఇందుకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే.దీంతో బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురు చూశారు.

ఇకపోతే బాలకృష్ణను కలవాలి అనుకున్నవాళ్ళు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్త్రీమింగ్ అయిన సినిమాను నిన్న ఆరు గంటల నుంచి 23వ తేదీ అర్ధరాత్రి వరకూ అఖండ సినిమాను హాట్ స్టార్ లో చూడాలి.ఆ తర్వాత ఈ సినిమా గురించి ట్విట్టర్ లో #AkhandaRoarOnHotstar అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేయాలి.అలా చేసిన వారిలో 500 మందిని లక్కీడ్రా ద్వారా సెలెక్ట్ చేస్తారు.వారందరినీ కూడా ఒక రోజు బాలయ్య దగ్గరికి తీసుకువెళ్లి బాలయ్య బాబు ను కలిసే అవకాశం కల్పిస్తారు.

ఇక ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న బాలయ్య అభిమానులు సదరు ఓటీటీ సంస్థ చెప్పిన విధంగా చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube