దసరా మిస్ అయినా దీపావళి బ్లాక్ చేస్తున్న అఖండ!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ‘ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈయన గత కొంతకాలంగా హిట్స్ లేక రేసులో వెనుకబడి పోతున్నాడు.

 Akhanda Movie Release In Diwali Season Update, Diwali 2021, Akhanda Update, Akha-TeluguStop.com

ఇక ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.అటు బోయపాటి శ్రీను కూడా ప్లాపులతో సతమత మవుతున్నాడు.

అందుకే ఈ సినిమాతో ఇద్దరు మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నారు.

చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమాపై ప్రేక్షకులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.

ఎందుకంటే ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు అన్ని కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి.కరోనా వల్ల ఆలస్యం లేకపోతే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

కానీ కరోనా కారణంగా అన్ని తారుమారు అయ్యాయి.ఇక ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమా దసరా సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరు భావించారు.

Telugu Akahnda, Akhanda, Akhandadiwali, Balakrishna, Boyapati Srinu, Diwali, Pra

కానీ ఇంకా షూట్ బాలన్స్ ఉండడం వల్ల ఈ సినిమాను దసరా బరిలోకి దింపలేదు.అయితే దసరా సీజన్ మిస్ అయినా కూడా అఖండ దీపావళి సీజన్ ను బ్లాక్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇంతకుముందు అనుకున్నట్టు గానే ఈ సినిమాను దీపావళి సీజన్ లో విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని సమాచారం.

Telugu Akahnda, Akhanda, Akhandadiwali, Balakrishna, Boyapati Srinu, Diwali, Pra

ఇక ఈ సినిమా కోసం ఒక డేట్ కూడా బ్లాక్ చేసారని తెలుస్తుంది.ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయాలని అందుకోసం ఈ డేట్ ను లాక్ చెయ్యాలని చూస్తున్నట్టుగా తాజాగా సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది.ఇక దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్య జైశ్వాల్ నటిస్తుండగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ద్వారకా క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube