సింగిల్ గా వచ్చి దసరా సీజన్ క్యాష్ చేసుకోబోతున్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూట్ కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది.

 Akhanda Movie Release In Dasara Season Update Akhanda Update, Akhanda, Balakrish-TeluguStop.com

కరోనా తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసిన బోయపాటికి సెకండ్ వేవ్ మళ్ళీ బ్రేక్ వేసింది.ఆ తర్వాత ఎట్టకేలకు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఈ సినిమాను ఆల్మోస్ట్ చివరి దశకు తీసుకు వచ్చాడు.

చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమాపై ప్రేక్షకులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది ఈసారి హిట్ గ్యారంటీ అని.ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నందమూరి అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

కేవలం పాటలు మాత్రమే బాలన్స్ ఉన్న నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోబోతుంది.

Telugu Akhanda, Akhandadasara, Balakrishna, Boyapati Srinu, Dasara Season, Pragy

ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పై ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా అప్పుడు రిలీజ్ అవుతుంది.ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని చాలా రూమర్స్ వచ్చాయి.ఇక ఇప్పుడు వస్తున్నా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దసరా బరిలోకి దిగబోతుందని టాక్.

Telugu Akhanda, Akhandadasara, Balakrishna, Boyapati Srinu, Dasara Season, Pragy

ఇప్పటి వరకు దసరాకు ఒక్క సినిమా కూడా ప్రకటించాక పోవడంతో ఈసారి బాలయ్య సోలోగా వచ్చి దసరా సీజన్ కలెక్షన్లు కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది.దసరాకు వస్తే భారీ ఓపెనింగ్స్ రావడంతో పాటు అధిక వసూళ్లు కూడా వస్తాయి.దీంతో చిత్ర నిర్మాత లాభపడతాడు.అందుకే ఈ సినిమాను దసరాకు రిలీజ్ చెయ్యబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.చూడాలి మరి ఈ సినిమా చివరకు ఎప్పుడు రిలీజ్ చేస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube