అఖండ ప్రీ రిలీజ్ వేడుకపై ఫ్యాన్స్ అసంతృప్తి.. నిర్మాతపై ఫైర్‌

Akhanda Movie Pre Release Event In Shilpa Kala Vedika

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న బాలకృష్ణ అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తేదీ మరియు వేదిక కన్ఫర్మ్‌ అయ్యింది.ఈనెల 27 సాయంత్రం 6.30 గంటలకు శిల్ప కళా వేదికలో ఈ వేడుక జరుగబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు.అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదిక విషయంలో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

 Akhanda Movie Pre Release Event In Shilpa Kala Vedika-TeluguStop.com

ఒకప్పుడు తెలుగు సినిమా కు సంబంధించిన కార్యక్రమాలు అన్ని కూడా శిల్ప కళా వేదికలో జరిగాయి.కొన్ని వందల సినిమాల ఆడియో వేడుకలు.ఇతర కార్యక్రమాలు ప్రీ రిలీజ్ వేడుకలు అక్కడ జరిగాయి.ఇప్పుడు అఖండ కూడా అక్కడే నిర్వహించబోతున్నారు.

కాని ఇక్కడ అసలు విషయం ఏంటీ అంటే శిల్ప కళా వేదిక ఔట్‌ డేటెడ్‌ అయ్యింది.శిల్ప కళా వేదిక చరిత్రగా మిగిలి పోయింది.

 Akhanda Movie Pre Release Event In Shilpa Kala Vedika-అఖండ ప్రీ రిలీజ్ వేడుకపై ఫ్యాన్స్ అసంతృప్తి.. నిర్మాతపై ఫైర్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిన్నా చితకా సినిమాలు మరియు ఇతర కార్యక్రమాలు మాత్రమే అక్కడ జరుగుతున్నాయి.ఇప్పుడు ఈవెంట్స్ మొత్తం కూడా కన్వెన్స్‌ ల్లో లేదా హైటెక్స్ లో జరుగుతున్నాయి.శిల్ప కళా వేదికలో స్టార్‌ హీరో సినిమా వేడుక జరిగి చాలా కాలం అయ్యింది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాంటి శిల్ప కళా వేదికలో ఎందుకు మీరు ఇలా ప్రీ రిలీజ్ వేడుక చేస్తున్నారంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అఖండ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ను భారీ ఎత్తున చేయకుండా ఎందుకు ఇలా తక్కువ స్థాయిలో చేస్తున్నారంటూ అభిమానులు నిర్మాతపై ఫైర్ అవుతున్నారు.మొత్తానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకపై జనాల్లో ఆసక్తి తగ్గేలా చేశారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతుంది.శ్రీకాంత్‌ మరియు జగపతిబాబులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

#Fans #Akhanda #Boyapati #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube