15 కోట్లకి అఖండ హిందీ డబ్బింగ్ రైట్స్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో మూవీ అంటేనే ఒక రకమైన హైప్ ఉంటుంది.ఫ్యాన్స్ లో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉంటాయి.

 Akhanda Movie Hindi Dubbing Rights Sold Out, Balakrishna, Boyapati Srinu, Tollyw-TeluguStop.com

బాలయ్యని తెరపై ఎలా ప్రెజెంట్ చేయాలో బోయపాటికి తెలిసినట్లు ఎవరికి తెలియదని నందమూరి ఫాన్స్ ఫీలింగ్.యాక్షన్ కథలకి కేరాఫ్ గా ఉండే బోయపాటి హీరోని ఎలివేట్ చేయడంలో తనదైన శైలిని ఫాలో అవుతూ ఉంటాడు.

బలమైన విలన్ క్యారెక్టర్ ని సృష్టించి అలాంటి విలన్ ని ఎదుర్కొనే హీరోగా కథానాయకుడి పాత్రని రిప్రజెంట్ చేస్తాడు.ఈ కారణంగానే బోయపాటి సినిమాలు భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి.

బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు ఎంత సెన్సేషన్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.ఇదిలా ఉంటే ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న మూడో సినిమా అఖండ.

ఈ మూవీపై ఆరంభంలో నందమూరి ఫాన్స్ కి కొన్ని అనుమానాలు ఉన్న రెండు టీజర్స్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశారు.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Tollywood-Movie

ఈ నేపధ్యంలో వీరిద్దరి కలయికలో మూవీ తో హ్యాట్రిక్ హిట్ ఖాయం అనే మాట వినిపిస్తుంది.ఇదిలా ఉంటే అఖండ టీజర్స్ కి బాలకృష్ణ కెరియర్ ఏ సినిమాకి రానివిధంగా అత్యధిక వ్యూస్ అతి తక్కువ సమయంలోనే వచ్చాయి.ఇక తెలుగులో వచ్చే యాక్షన్ మూవీస్ కి హిందీ డబ్బింగ్ లో మంచి డిమాండ్ ఉన్నాయి.

అల్లు అర్జున్, బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన యాక్షన్ కథలు హిందీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ తెచ్చుకున్నాయి.నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాల ప్రజలకి ఈ యాక్షన్ కథలు విపరీతంగా నచ్చుతాయి.

ఈ నేపధ్యంలో అఖండ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం ఊహించని స్థాయిలో ఆఫర్ వచ్చింది.బాలకృష్ణ కెరియర్ లో ఏ సినిమాకి రాని విధంగా ఈ సినిమా డబ్బింగ్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకంగా 15 కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది.

నిజంగా ఇది పెద్ద మొత్తం అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube