బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ అఖండ.అద్భుత విజయాన్ని అందుకుంది.
ఏపీ, తెలంగాణతో పాటు ఓవర్సీస్ లోనూ భారీ కలెక్షన్లు సాధిస్తుంది.తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో అసెట్ గా మారింది.
ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతం అంటున్నారు.అయితే ఈ సినిమాలో బేబి దేష్ణ ఓ సూపర్ రోల్ పోషించింది.
తన నటన పట్ల జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.తాజాగా ఆ పాపకు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది.
బాలయ్య ఆ అమ్మాయిని ముద్దు చేస్తూ ఇందులో కనిపిస్తాడు.ప్రీ రిలీజ్ ఈమెంట్ లోనూ ఆ పాపపై ఆయన ప్రశంసలు కురిపించాడు.
తాజాగా దేష్ణ, ఆమె పేరెంట్స్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సినిమాకు సంబంధించి పలు వివరాలు వెల్లడించారు. ఇన్ స్టా ద్వారా పాప నిర్మాతలతో కనెక్ట్ అయినట్లు వెల్లడించారు.ఆ తర్వాత బోయపాటికి పరిచయం అయినట్లు చెప్పారు.పాపను చూసి మంచి క్యారెక్టర్ ఇచ్చినట్లు చెప్పారు.పాపకు తొలి సినిమానే మంచి పేరు తీసుకురావడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు.బాలయ్య దేష్ణతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్నట్లు చెప్పారు.మాటలు కూడా సరిగా రాని పాపతో బోయపాటి మంచి యాక్టింగ్ చేయించినట్లు చెప్పారు.
తమను కుటుంబ సభ్యులుగా చూసుకున్నట్లు చెప్పారు.
దేష్ట సినిమాలో చేసే ప్రతి సీన్ ను బాలయ్య చూసి.అద్భుతం అనే వారని చెప్పారు.దేష్ట కూడా తను చేసిన ప్రతి సీన్ మానిటర్ లో చూసుకునేదని చెప్పారు.
పాపకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు బోయపాటికి వారు ధన్యవాదాలు చెప్పారు.బాలయ్యతో కలిసి నటించే అవకాశం తమ పాపకు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉందంటున్నారు.
ఈ సినిమా మూలంగా తమ పాపకు, తమకు ఎంతో పేరు వచ్చిందంటున్నారు.ఈ సినామా అందరూ చూడాలని కోరారు.తమ పాప నటన ఎలా ఉందో చెప్పాలని కోరుతున్నారు.