అఖండ జాతర.. లవ్ స్టోరీ రికార్డ్ బ్రేక్ చేసిన బాలయ్య!

Akhanda Breaks Love Story Record At Overseas Box Office

నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సినిమా ‘అఖండ‘.ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా అడ్డంకిగా మారింది.

 Akhanda Breaks Love Story Record At Overseas Box Office-TeluguStop.com

ఇక షూటింగ్ ఆలస్యం అవడంతో ఈ సినిమాను ఇప్పటికి రిలీజ్ చేసారు.నిన్న డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్స్ లో విడుదల అవ్వగా ప్రతి చోట పాజిటివ్ టాక్ రావడంతో నందమురి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Telugu Akhanda, Akhandabreaks, Balakrishna, Boyapati, Love Story, Box-Movie

అందరు పెట్టుకున్న అంచనాలను బాలయ్య, బోయపాటి వమ్ము చేయలేదు.చాలా రోజుల తర్వాత బాలయ్య నుండి ప్రేక్షకులు ఆశించిన స్థాయి సినిమా రావడంతో అందరిలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.ఇక నందమూరి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కరోనా తర్వాత వచ్చిన స్టార్ హీరో సినిమా కావడంతో ఈ సినిమా రిజల్ట్ కోసం టాలీవుడ్ హీరోలంతా ఎదురు చూసారు.

 Akhanda Breaks Love Story Record At Overseas Box Office-అఖండ జాతర.. లవ్ స్టోరీ రికార్డ్ బ్రేక్ చేసిన బాలయ్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మాస్ యాక్షన్ తో ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని కట్టి పడేసింది.తెలుగులోనే కాకుండా ఓవర్శిస్ లో కూడా అఖండ ప్రభంజనం చూపించింది.కరోనా తర్వాత ఓవర్శిస్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీమియర్ షో కలెక్షన్స్ ఈ సినిమాకు లభించాయి.

ఉత్తర అమెరికాలో ఈ సినిమా $325k వసూలు చేసి ఇప్పటికే ఉన్న పలు బాక్సాఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది.

Telugu Akhanda, Akhandabreaks, Balakrishna, Boyapati, Love Story, Box-Movie

అంతేకాదు 2021 లో విడుదల అయినా తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా అఖండ ముందు వరుసలో ఉంది.ఈ సంవత్సరం నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఉత్తర అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా $313k వసూలు చేసింది.ఈ రికార్డ్ ను బాలయ్య అఖండ సినిమా బ్రేక్ చేసింది.

చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంది.ఎక్కడ చూసినా.

ఎక్కడ విన్న ప్రతి ఒక్కరి నోటి నుండి అఖండ పేరు మాత్రమే వినిపిస్తుంది.అంతలా ఈ సినిమా అభిమానులకు నచ్చింది.

#AkhandaBreaks #Balakrishna #Boyapati #Akhanda #Box

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube