అఖండ సినిమాపై లేటెస్ట్ క్రేజీ న్యూస్..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.

 Akhanda Balakrishna Movie Latest Update-TeluguStop.com

గత కొన్ని రోజులుగా బాలకృష్ణ హిట్స్ లేక బాధపడుతున్నాడు.ఈ ప్రభావం అతని మార్కెట్ పై కూడా పడుతుంది.

ఈయన సినిమాలు విడుదల అయినా కూడా జనాలు అంతగా పట్టించుకోవడం లేదు.

 Akhanda Balakrishna Movie Latest Update-అఖండ సినిమాపై లేటెస్ట్ క్రేజీ న్యూస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాపై మాత్రం అంచనాలు బాగానే ఉన్నాయి.

ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్ అయ్యాయి.ఇప్పుడు అఖండ సినిమాపై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి.

ఉగాది కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ సినిమాలో బాలయ్య ఇంత వరకు చూడని సరికొత్త లుక్ లో కనిపించాడు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తుండడంతో ఈ సినిమా పాటల విషయంలో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా పై ప్రగ్యా కొన్ని ఆసక్తికర సమాసాలు వెల్లడించింది.అంతేకాదు ఈ సినిమా షూటింగ్ విషయంలో కూడా ఒక అప్డేట్ తెలిపింది.ఈ సినిమా ఇంకా షూటింగ్ 15 నుండి 20 రోజులు చేస్తే షూట్ మొత్తం కంప్లీట్ అవుతుందని తెలిపింది.ఈ కొద్దీ భాగం అయిపోతే ఇంకా ఈ సినిమా పూర్తి అయినట్టే.

ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది.పరిస్థితులు కొద్దిగా చక్కబడితే ఈ కొద్దీ భాగం పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ రెడీగా ఉంది.

#AkhandaMovie #Pragya Jaiswal #Boyapati Srinu #Balakrishna #AkhandaMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు