బాలయ్య సాహసం.. ''అఖండ'' రిలీజ్ అప్పుడేనా..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నాడు.వీరిద్దరి కాంబోలో ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.

 Akhanda Balakrishna Movie Latest Crazy News, Balakrishna, Boyapati Srinu, Akhand-TeluguStop.com

ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాపై వీరి కన్ను పడింది.వరుస ప్లాపుల్లో ఉన్న బాలయ్య, బోయపాటి ఇద్దరు కూడా ఈ సినిమాను ఎలాగైనా సూపర్ హిట్ చేయాలనే కసితో ఉన్నారు.

ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదని చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఈ టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది.ఈ సినిమా మే లోనే విడుదల చేయాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడి సినిమా విడుదల ఆగిపోయింది.

ప్రస్తుతం అఖండ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

అందుకే ఈ సినిమా విడుదల కోసం అంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు.బాలయ్య ఈ సినిమాను దసరా కు తీసుకురావాలని అనుకుంటున్నాడట.

అయితే ఇప్పటికే దసరా టైంకు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను బరిలోకి దించుతున్నాడు.అందుకే వేరే సినిమాలు ఏవీ కూడా దసరా బరిలోకి రావాలని అనుకోవడం లేదు.

కానీ బాలకృష్ణ మాత్రం దసరాకే అఖండ సినిమాను విడుదల చేయాలనీ అనుకుంటున్నాడట.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Pragya Jaiswal-Movie

ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13 న విడుదల అవ్వబోతున్నట్టు రాజమౌళి ఎప్పుడో చెప్పేసారు.అందుకే ఆర్ఆర్ఆర్ సినిమా ఎలాగూ సూపర్ హిట్ అవుతుంది కాబట్టి ఎవ్వరు ఈ సినిమా దరిదాపుల్లోకి రావాలని అనుకోవడం లేదు.కానీ బాలయ్య ఈ సినిమాకు వారం ముందు కానీ లేదా వారం తర్వాత కానీ అఖండ సినిమా విదుల్ చేయాలనీ భావిస్తున్నాడట.

కానీ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయితే రెండు వారాలపాటు ఎవ్వరి సినిమాలు వచ్చిన ప్రేక్షకులు పట్టించుకోరు.కాబట్టి బాలయ్య దసరాకు కాకుండా దీపావళికి వస్తే బాగుంటుందని అందరు భావిస్తున్నారు.

మరి చూడాలి బాలయ్య తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube