లేటెస్ట్ బజ్.. 'అఖండ' కొత్త రిలీజ్ డేట్ లో రాబోతోందా..!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

 Akhanda Balakrishna Movie Latest Crazy News 3-TeluguStop.com

ఈ మధ్యనే కరోనా తగ్గుముఖం పట్టి థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో అందరు తమ సినిమాలను విడుదల చేయడానికి డేట్స్ వెతుకుతున్నారు.

ఇప్పటికే ఒక్కొక్కరు తమ సినిమా రిలీజ్ డేట్ లను ప్రకటించేస్తున్నారు.

 Akhanda Balakrishna Movie Latest Crazy News 3-లేటెస్ట్ బజ్.. అఖండ’ కొత్త రిలీజ్ డేట్ లో రాబోతోందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలయ్య అఖండ కూడా ఎప్పుడు డేట్ కన్ఫర్మ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా ఇప్పుడు అప్పుడు అంటూ చాలా రూమర్స్ వచ్చాయి.

ఈ సినిమా రిలీజ్ డేట్ ఇదేనంటూ తాజాగా ఒక రూమర్ బయటకు వచ్చింది.చిత్ర యూనిట్ ఈ డేట్కే అఖండ సినిమాను విడుదల చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్ 27 న రిలీజ్ చేయబోతున్నారని టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది.మరి ఇది ఎంత వరకు నిజమో త్వరలోనే తెలుస్తుంది.ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇందులో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించి ప్రేక్షకులను అలరించ బోతున్నాడు.

ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.అంతేకాదు జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు ఎంత హిట్ అయ్యాయో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని బోయపాటి, బాలయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మరి చూడాలి ఈ సినిమా బాలయ్య కెరీర్ కు ఎంత మేరకు ఉపయోగ పడుతుందో.

#Akhanda #Akhanda #Boyapati Srinu #Balakrishna #Pragya Jaiswal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు