సునీల్‌కు కనీస విశ్వాసం లేదంటున్న హీరో

కమెడియన్‌ నుండి హీరోగా మారిన సునీల్‌ ప్రస్తుతం మళ్లీ కమెడియన్‌గా సినిమాలు చేసుకుంటున్న విషయం తెల్సిందే.రీ ఎంట్రీలో కమెడియన్‌గా అలరించేందుకు చాలా కష్టపడుతున్న సునీల్‌పై మాజీ హీరో ఆనంద్‌ ఫేం ఆకాష్‌ సెన్షేషనల్‌ కామెంట్స్‌ చేశాడు.

 Akash Sunil Andala Ramudu-TeluguStop.com

మూలిగే నక్కపై తాడిపండు తరహాలో సునీల్‌ పై ఆకాష్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ సునీల్‌ పరువు తీసే విధంగా ఆకాష్‌ మాట్లాడటం జరిగింది.

ఇటీవల ఆకాష్‌ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను గతంలో హీరోగా పలు చిత్రాల్లో నటించాను.ఆసమయంలో సునీల్‌తో ఉన్న పరిచయం కారణంగా ఆయన హీరోగా నటించిన అందాల రాముడు సినిమాలో ఒక చిన్న రోల్‌ను చేసేందుకు ఒప్పుకున్నాను.

అయితే ఆ సినిమా కోసం నన్ను ఒప్పించేందుకు సునీల్‌ చాలా బతిమిలాడాడు.ఎప్పుడైతే సినిమా పూర్తి అయ్యిందో ఆ తర్వాత నన్ను పట్టించుకోలేదు.సినిమా సక్సెస్‌ అవ్వడంతో నా వైపు కూడా చూడలేదు.

Telugu Akash, Andala Ramudu, Maryada Ramanna, Sunil-Latest News - Telugu

సినిమా సక్సెస్‌ వేడుకలో ఒకసారి సునీల్‌ మాట్లాడుతూ కనీసం నా పేరు కూడా ఎత్తలేదు.నీను అతడి కోసం నా స్థాయికి దిగి ఆ పాత్రను చేశాను.అయినా కూడా విశ్వాసం లేకుండా సునీల్‌ ప్రవర్తించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సునీల్‌ తీరుపై ఆకాష్‌ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.సునీల్‌పై విమర్శలు చేసిన ఆకాష్‌ తనకు రవితేజ మంచి స్నేహితుడు అన్నాడు.

రవితేజతో ఒక సినిమా కలిసి చేసినందుకు ఇప్పటికి రవితేజ నన్ను గుర్తుంచుకుని మాట్లాడుతాడు అంటూ ఆకాష్‌ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube