సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ( Puri Jagannadh ) ఒకరు.ఈయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హీరోకి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే ఇటీవల కాలంలో పూరి సినిమాలకు పెద్దగా ఆదరణ రాలేకపోతోంది.ఇక ఈయన ప్రస్తుతం రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ ( Double Ismart ) అనే సినిమాలో నటిస్తున్నారు.

ఇక పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి( Akash Puri ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాల నటుడిగా ఆకాష్ పలు సినిమాలలో నటించారు.ప్రస్తుతం ఈయన కూడా హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు.అయితే ఇప్పటివరకు పలు సినిమాలలో నటించినటువంటి ఆకాష్ కి ఇప్పటివరకు సరైన హిట్టు పడలేదు.ఇలా హీరోగా నిలుదొక్కుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా తొలిసారి ఆకాష్ ఓ క్లాతింగ్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంటోంది.ఈ క్లాతింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం హ్యాపీగా ఉందని తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయనకు విలేకరుల నుంచి ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఎదురైంది.మీ నాన్న దర్శకత్వంలో ఎప్పుడు సినిమా చేస్తున్నారనే ప్రశ్న ఎదురవడంతో ఆకాష్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నేను నటుడిగా నన్ను నేను నిరూపించుకున్న తరువాతనే నాన్న డైరెక్షన్లో సినిమా చేస్తానని అప్పటివరకు నేను నాన్న డైరెక్షన్లో సినిమాలు చేయనని తెలిపారు.నటుడిగా నాకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్న తరువాత నాన్నతో ఓ పెద్ద సినిమా చేస్తానని ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.