రొమాంటిక్ రిలీజ్ వారం ముందుకు మార్చారు..!

ఆకాష్ పూరీ, కెతిక శర్మ జంటగా అనీల్ పాదురి డైరక్షన్ లో వస్తున్న సినిమా రొమాంటిక్.పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.సినిమా ఎప్పుడో పూర్తయినా రిలీజ్ విషయంలో క్లారిటీ రాలేదు.ఈమధ్య నవంబర్ 4 దీపావళి కానుకగా ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేశారు.అయితే నవంబర్ 4న కాంపిటీషన్ ఎక్కువ అవడంతో రొమాంటిక్ సినిమా రిలీజ్ డేట్ మార్చేశారు.ఈసారి రిలీజ్ డేట్ ను వెనక్కి జరుపకుండా ఒక వారం ముందుకి జరిపారు.

 Akash Puri Romantic Movie Release Date Changed , Akash Puri, Kethika Sharma, Lat-TeluguStop.com

రొమాంటిక్ సినిమా అక్టోబర్ 29న రిలీజ్ ఫిక్స్ చేశారు.సినిమాలో కెతిక శర్మ అందాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు.ఒక సినిమా రిలీజ్ అవకుండానే కెతిక శర్మ వరుస సినిమాలు చేస్తూ వస్తుంది.ఈ సినిమాతో అమ్మడికి గ్రాండ్ లాంచింగ్ అవుతుందని అంటున్నారు.

ఇక ఆకాష్ పూరీ కూడా రొమాంటిక్ తో యూత్ ఫుల్ హిట్ అందుకోవడం పక్కా అని అంటున్నారు.మరి ఆకాష్ పూరీ రొమాంటిక్ హిట్ కొడతాడా లేదా అన్నది తెలియాలంటే ఈ నెల చివరి వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube