శృతిమించితే బూతు అవుతుందేమో చూసుకోండి, టైటిల్‌కు తగ్గట్లుగా రొమాన్స్‌  

Akash Puri Romantic Movie Latest Update-dashing Director Purijaganath

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఆయన కొడుకు ఆకాష్‌ పూరి హీరోగా మెహబూబా చిత్రంతో పరిచయం అయ్యాడు.మొదటి సినిమాతో ఆకాష్‌ పూర్తిగా నిరాశ పర్చాడు.

Akash Puri Romantic Movie Latest Update-dashing Director Purijaganath Telugu Tollywood Movie Cinema Film Latest News Akash Puri Romantic Movie Latest Update-dashing Director Purijaganath-Akash Puri Romantic Movie Latest Update-Dashing Director Purijaganath

అసలు ఆ సినిమా గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించలేదు.ఏదో గొప్ప ప్రేమ కావ్యంను తీస్తున్నాను అంటూ ప్రకటించిన దర్శకుడు పూరి ఒక చెత్త సినిమాను తీశాడు అంటూ విమర్శలు వచ్చాయి.

అంత్యంత దారుణమైన స్క్రీన్‌ప్లే అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి.

మెహబూబా చిత్రం తర్వాత ఆకాష్‌ పూరి చిన్న గ్యాప్‌ తీసుకుని చేస్తున్న సినిమా ‘రొమాంటిక్‌’.ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాకు పూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.రొమాంటిక్‌ సినిమా టైటిల్‌కు తగ్గట్లుగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు పదే పదే చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగానే ఇప్పటికే ఒక స్టిల్‌ను విడుదల చేశారు.ఆ ఫొటో ఆమద్య చాలా రచ్చ చేసింది.

బాబోయ్‌ మరీ ఇంత రొమాంటిక్‌గానా అనుకున్నారు.

ఇక ప్రస్తుతం గోవాలో కొన్ని సీన్స్‌ మరియు పాటల చిత్రీకరణ జరుపుతున్నారట.

సినిమా యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిత్రంలో రొమాంటిక్‌ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట.ఈ రొమాంటిక్‌ సీన్స్‌తో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోతుందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు.

అయితే రొమాన్స్‌ మరీ ఎక్కువ అయితే అదో బూతు సినిమా అవుతుందని, కాస్త చూసుకుని చేయాల్సిన అవసరం ఉంది అంటూ సినీ విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.