ఆకాశం నీ హద్దురా సినిమాపై మహేష్ కామెంట్..!

విమానం ఎక్కడం ఎన్నటికీ సాధ్యం కాని సామాన్య, మధ్య తరగతి కుటుంబాల కోరికను, తన కలను నిజం చేసే సినిమానే ఆకాశం నీ హద్దురా.ఈ మూవీలో హీరో అసాధ్యం అనే తన కలను, విమానం ఎక్కాలనే ఉబలాటపడే పేదల కోరికను సాధ్యం చేసి చూపించిన ఈ మూవీ భారీ హిట్ ను సంపాదించుకుంది.

 Akasam Nee Haddura Film, Inspiration Film, Mahesh Babu, Suya, Sudha Kongara Pras-TeluguStop.com

ఈ నినిమాలను ‘ఎయిర్ డెక్కన్’ గోపీనాధ్ జీవిత కథ ఆధారంగా రూపొందించి సెన్సేషనల్ హిట్ ను సంపాదించారు.

ఈ ఆకాశం నీ హద్దురా సినిమాతో సుధ కొంగర దర్శకురాలిగా తన ప్రతిభేమిటో మరోసారి అందరికీ చాటుకున్నారు.

సామాన్యుడు కూడా విమానంలో ఎగరాలనే తన కోరికను, అందరికీ అందుబాటులో టికెట్ ధరను తీసుకురావలనే కోరిక హీరో క్యారెక్టర్ ను తెలియజేస్తుంది.ఈ సినిమా ద్వారా హీరో సూర్య మరో సారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

అలాగే సుధా కొండర డైరక్షన్ అదరహో అంటూ అభిమానులూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

తమ భావాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.కాగా కొందరు సినీ నటులు కూడా ఈ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రీసెంట్ గా ఈ సినిమాను వీక్షించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ఆకాశం నీ హద్దురా సినిమా యూనిట్ మొత్తాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఆకాశం నీ హద్దురా’(శైరరై పోట్రు) మూవీ అందరికీ స్ఫూర్తిదాయకమైనదని మహేశ్ బాబు అన్నారు.

అలాగే డైరెక్ట్ కు, అద్బుతంగా నటించిన హీరో సూర్యకు అలాగే చిత్ర యూనిట్ మొత్తానికి ఆయన అభినందలు తెలిపారు.మహేశ్ బాబు ప్రశంసలకు హీరో సూర్య తన స్పందనను ట్విట్టర్ వేదికగా స్పందించారు.

మా సినిమాపై ప్రశంసలు చేసిన మహేశ్ బాబుకు ధన్యవాదాలని హీరో సూర్య తన భావాలను వ్యక్తం చేశారు.అలాగే మహేశ్ నటిస్తున్న సర్కారీ వారి పాట మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నామని సూర్య ట్విట్టర్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube