చిన్న వయస్సులోనే పిల్లలు ఉన్నతంగా ఆలోచిస్తే వాళ్లు భవిష్యత్తులో మరింత సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఆకర్షణ సతీష్( akarshana ) అనే విద్యార్థిని 6,000 పాత పుస్తకాలతో 7 గ్రంథాలయాలను ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచారు.
ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆకర్షణ సతీష్ ను అభినందించడం గమనార్హం.తాజాగా మన్ కీ బాత్ లో మోదీ మాట్లాడుతూ చదువుకోవడం నేర్చుకోవడంలోని ఆనందాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వ్యాప్తి చేస్తున్న ఆకర్షణ సతీష్ ను చూసి గర్విస్తున్నానని అన్నారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్( Hyderabad Public School ) లో చదువుకుంటున్న ఆకర్షణ ఏడో తరగతి చదువుతూనే 7 లైబ్రరీలను ఏర్పాటు చేశారు.6,000 పాత పుస్తకాలతో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయాలు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి.2021 కరోనా సమయంలో ఆకర్షణ ఒక ఆస్పత్రికి పేరెంట్స్ తో కలిసి ఆహారాన్ని అందించడానికి వెళ్లారు.ఆ సమయంలో అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులు దృష్టి మరల్చడానికి ఒక గ్రంథాలయాన్ని అక్కడ ఏర్పాటు చేశారు.

ఆమె ఆలోచనకు మంచి స్పందన రావడంతో ఆ విధంగా ఏడు గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు.మంత్రి హరీష్ రావు వచ్చే వారం సిద్ధిపేటలో ఎనిమిదో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.అక్టోబర్ 15వ తేదీన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సమయానికి పదో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఆకర్షణ కామెంట్లు చేయడం గమనార్హం.తండ్రి సతీష్ కుమార్( Satish Kumar ) మాట్లాడుతూ అబ్దుల్ కలాం తన కూతురికి ఆకర్షణ అనే పేరు పెడతానని చెప్పుకొచ్చారు.
సతీష్ కుమార్ అప్పట్లో అబుల్ కలాం దగ్గర పని చేశారు.ప్రస్తుతం సతీష్ కుమార్ ప్రముఖ ప్రైవేట్ హెల్త్ కేర్ సంస్థలో సీనియర్ మేనేజర్ గా చేస్తున్నానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సమయంలో ఆకర్షణను కలుస్తానని మోదీ ( Narendra Modi )వెల్లడించడం గమనార్హం.