బైక్ రైడ్ చేస్తూ రికార్డులు కొడుతున్న హీరో అజిత్..!- Ajith The Hero Who Sets Records By Riding A Bike

ajeeth, varanasi, 4500 km, bike raceing, bmw bike, long trip, travel,tollywood,kollywood,valimei,tollywood,vinod ch,varanasi,chennai,lockdown - Telugu 4500 Km, Ajeeth, Bike Raceing, Bmw Bike, Long Trip, Travel, Varanasi

మనం ఎక్కువగా సినిమాలలో బైక్ రేసింగ్, బైక్ ఛేజింగ్ లాంటివి చూస్తూ ఉంటాం.కానీ రియల్ లైఫ్ లో బైక్ రేసింగ్ అంటే చాలా మంది భయాందోళనలకు గురి అవుతూ ఉంటారు.

 Ajith The Hero Who Sets Records By Riding A Bike-TeluguStop.com

రెప్పపాటు క్షణంలో ఎటువంటి తప్పు జరిగినా కానీ రేస్ చేస్తున్న వ్యక్తి ప్రాణాలకే ప్రమాదం అని తెలిసిన కూడా చాలా మంది బైక్ రేసింగ్ పై మొగ్గు చూపుతుంటారు.ఇదివరకు కాలంలో స్టార్ హీరోయిన్ అయిన సావిత్రికి కూడా కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టమని అప్పట్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా తానే స్వయంగా కార్లను మరి పేరు.

నేటి తరం మహిళలలు కూడా చాలామంది బైక్ నడపడంపై మొగ్గు చూపుతున్నారు.

 Ajith The Hero Who Sets Records By Riding A Bike-బైక్ రైడ్ చేస్తూ రికార్డులు కొడుతున్న హీరో అజిత్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాకపోతే కొందరు సినీ స్టార్స్ కూడా బైక్ లేదా కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం.తమిళ స్టార్ హీరో అజిత్ కు బైక్ డ్రైవింగ్ అన్న, బైక్ పై లాంగ్ జర్నీ అన్న చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.వాస్తవానికి చిన్న హీరోలు కూడా ప్రస్తుతం బైక్ పై బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు.

కానీ, అజిత్ మాత్రం వేల కిలోమీటర్లు బైక్ పై తిరిగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.ఇక లాక్ డౌన్ సమయంలో కూడా హైదరాబాద్ నుంచి చెన్నై వరకు బైక్ పై షికార్లు కొట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం వారణాసి, ఇంకా ఉత్తర భారతానికి బైక్ రైడ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇందులో భాగంగానే ఇప్పటికే అజిత్ 4,500 కిలోమీటర్లు ట్రావెల్ చేసినట్లు సమాచారం.

వారణాసిలో బైక్ తో దిగిన అజిత్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.చెన్నై నుండి సిక్కింకు తన బీఎండబ్ల్యూ బైక్ పై ట్రావెల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ వారణాసికి చేరుకున్నట్లు సమాచారం.

అక్కడే రెండు మూడు రోజులు కాస్త విశ్రాంతి తీసుకున్న అనంతరం మళ్ళీ అక్కడి నుండి చెన్నైకి ప్రయాణం చేయబోతున్నట్లు అజిత్ తెలియజేశాడు.ఒక స్టార్ హీరో ఇంత దూరం బైక్ పై ప్రయాణం చేయడం అంటే ఒక రికార్డ్ అనే అనుకోవాలి.

ప్రస్తుతం అజిత్ వినోథ్ హెచ్ దర్శకత్వంలో వలిమై సినిమాలో ప్రేక్షకుల ముందు కనబడపోతున్నాడు.

.

#Bmw Bike #Long Trip #Ajeeth #Varanasi #Bike Raceing

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు