క్రికెట్ మధ్యలో అజిత్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. ఏం జరిగిందంటే?

అభిమాన హీరో సినిమా అంటే ఏ అభిమానులైన ఎదురుచూపులు చూడకుండా ఉండరు.ఇక వారి గురించి, వారి సినిమాల గురించి ఎక్కడైనా ఎంతో గొప్పగా చెబుతుంటారు.

 Ajith Fans Asks For Valimai Update In Wtc Final-TeluguStop.com

మామూలుగా క్రికెట్ స్టేడియంలో తమ అభిమాన క్రికెటర్ పేర్లతో లేదా తమ దేశం పేర్లతో ప్లకార్డులు ప్రదర్శించి బాగా ఎంకరేజ్ చేస్తుంటారు.కానీ తాజాగా క్రికెట్ స్టేడియం లో ఉన్న సమయంలో ఏకంగా ‘వలిమై అప్ డేట్‘ అంటూ ఇంగ్లీష్ లో ఉన్న కార్డు ను చూపించగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

సౌతాంప్టన్ లో జరుగుతున్న ఇండియా, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ లో హీరో అజిత్ ఫ్యాన్ వలిమై సినిమా అప్ డేట్ గురించి ప్లకార్డులో ప్రదర్శించాడు.ఈ సందర్భంగా ఇది కెమెరాకు చిక్కగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

 Ajith Fans Asks For Valimai Update In Wtc Final-క్రికెట్ మధ్యలో అజిత్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో కూడా చెన్నై క్రికెట్ స్టేడియం లో ఇండియన్ టీం మ్యాచ్ ఆడుతున్న సమయంలో వలిమై అప్ డేట్ గురించి అజిత్ ఫ్యాన్స్ బాగా రచ్చ చేశారు.ఇక ఈ విషయం గురించి అజిత్ ఎలా స్పందిస్తాడో తెలియదు కానీ గతంలో ఇలా చేయడం వల్ల అభిమానుల తీరుపై బాగా సంతృప్తి చెందాడు అజిత్.

Telugu Ajith, Azith Fans, Kollywood, Newziland, Tollywood, Vailmai Upadte Wtc Final-Movie

హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న వలిమై సినిమాలో అజిత్ హీరోగా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా గురించి అజిత్ కానీ, సినీ దర్శకుడు కానీ ఎటువంటి విషయాలను బయటకు ప్రకటించలేదు.దీంతో ఈ సినిమా ఉంటుందన్నప్పటినుంచి అభిమానులు ఈ సినిమా అప్ డేట్ ల గురించి తెగ ఎదురుచూస్తున్నారు.ఇక ఎటువంటి అప్ డేట్ లు లేకపోవడంతో అభిమానులు బాగా అల్లరి చేస్తున్నారు.

ఇక మరికొందరు గోడలపై వాల్ పోస్టర్లను కూడా ముద్రించినట్లు తెలిసింది.

ఇక ఈ విషయం గురించి స్పందించిన అజిత్ తీవ్ర అసంతృప్తికి దారి తీస్తున్నారని గతంలో తెలిపాడు.అంతేకాకుండా మనోవేదనకు గురయ్యానని కూడా తెలిపాడు.ఇక గతంలోనే ఈ సినిమా గురించి త్వరలోనే అప్ డేట్లు అందిస్తామని ఎటువంటి గొడవలు చేయవద్దని కోరాడు.

#Kollywood #Newziland #Ajith #Azith Fans #VailmaiUpadte

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు