సూపర్‌ స్టార్‌ను చంపేసిన యాంటీ ఫ్యాన్స్‌

తెలుగు హీరోలకు అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగు అభిమానులు కాస్త పద్దతిగా ఉంటారు.

 Ajith And Vijay Fans Clash-TeluguStop.com

కాని తమిళ హీరోల అభిమానులు మాత్రం అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు.వారు చేసే పనుల కారణంగా కొన్ని సార్లు ఆ హీరోలే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఇక హీరోల యాంటీ ఫ్యాన్స్‌ అంటూ కూడా అక్కడ ఉంటారు.అజిత్‌ ఫ్యాన్స్‌ విజయ్‌కు యాంటీ ప్యాన్స్‌ అన్నట్లుగా ఉంటారు.

ఒక సినిమా విడుదల అయ్యే సమయంలో వీరి మద్య సోషల్‌ మీడియా వార్‌ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సూపర్‌ స్టార్‌ను చంపేసిన యాం

తాజాగా అజిత్‌ ఫ్యాన్స్‌ తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ చనిపోయాడు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు.విజయ్‌ చనిపోయిన వార్త కొన్ని నిమిషాల్లోనే తమిళనాడు మొత్తం వ్యాప్తి చెందింది.విజయ్‌కు చెందిన సన్నిహితులు స్పందిస్తే తప్ప ఫ్యాన్స్‌ రిలాక్స్‌ అవ్వలేదు.

తీరా ఆ పోస్ట్‌ గురించి ఎంక్వౌరీ చేస్తే అది విజయ్‌ యాంటీ ఫ్యాన్స్‌ చేసినట్లుగా తెలిసింది.ఒక వ్యక్తి చేసిన పోస్ట్‌ను అజిత్‌ మరియు రజినీకాంత్‌ల అభిమానులు భారీగా షేర్‌ చేశారు.

దాంతో వెంటనే విషయం కాస్త వైరల్‌ అయ్యింది.

సోషల్‌ మీడియాలో తమిళ హీరోల మద్య గొడవలు పతాక స్థాయికి చేరుతూ ఉంటాయి.

ఇక బౌతిక దాడులు కూడా జరుగుతూనే ఉన్నాయి.ఇలాంటి పరిణామాల మద్య సోషల్‌ మీడియాలో చనిపోయాడు అంటూ ప్రచారం చేయడం పీక్స్‌కు చేరిందని చెప్పుకోవచ్చు.

ఆమద్య ఒక హీరో అభిమానిని మరో హీరో అభిమాని హత్య చేయడం జరిగింది.అభిమానం పేరుతో మరీ ఇంత దారుణంగా ప్రవర్తించడం దారుణం.

కాని తమిళనాట మాత్రం ఇది మరీ సహజంగా జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube