మహారాష్ట్ర ప్రజలను అజిత్ వెన్నుపోటు పొడిచారు అంటున్న సంజయ్ రౌత్

అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ,ఎన్సీపీ మద్దతు తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఎన్సీపీ పార్టీ సపోర్ట్ ఇవ్వడం తో బీజేపీ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తో ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర సీఎం గా ప్రమాణ స్వీకారం చేయగా,డిప్యూటీ సీఎం గా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.

 Ajit Pawar Has Backstabbed The Maharashtra People-TeluguStop.com

అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం ఈ విషయాలు తనకు తెలియవని, బీజేపీ కి తమ పార్టీ సపోర్ట్ లేదంటూ ప్రకటించారు.మరోపక్క అజిత్ చేసిన పనికి శివసేన పార్టీ జీర్ణించుకోలేక పోతుంది.

ఈ తాజా ప‌రిణామాల‌పై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ స్పందిస్తూ.సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం చేయ‌డానికి .శ‌ర‌ద్ ప‌వార్‌తో సంబంధం లేద‌న్నారు.మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అజిత్ ప‌వార్ వెన్నుపోటు పొడిచిన‌ట్లు రౌత్ విమ‌ర్శిస్తున్నారు.

Telugu Ajit Pawar, Ajitpawar, Bjp Ncp, Bjp Fadnavis, Maharaa, Sivasena-

ఉద్ద‌వ్‌, శ‌ర‌ద్ ప‌వార్‌లు ట‌చ్‌లో ఉన్నార‌ని, ఆ ఇద్ద‌రూ ఇవాళ మీడియాతో మాట్లాడ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.అజిత్ ప‌వార్‌తో పాటు అత‌నికి స‌పోర్ట్‌గా ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు.శివాజీని, మ‌హారాష్ట్ర‌ను అవ‌మానించార‌న్నారు.అజిత్ ప‌వార్ గ‌త రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు త‌మ‌తో పాటు భేటీ లోనే ఉన్నారని, ఆ తరువాతే అకస్మాత్తు గా మాయమయ్యారు అంటూ రౌత్ పేర్కొన్నారు.

అజిత్ ఆ భేటీలో కండ్ల‌ల్లో కండ్లు పెట్టి సూటిగా మాట్లాడ‌లేద‌ని, పాపం చేయ‌బోయే వ్య‌క్తి ఎలా త‌ల దించుకుని ఉంటాడో, అలా అత‌ను ప్ర‌వ‌ర్తించాడ‌ని రౌత్ విమ‌ర్శించారు.మొత్తానికి ఎన్సీపీ లో ఏర్పడిన చీలిక తో శివసేన ఆశలకు గండి పడినట్లు అయ్యింది.

మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పరచి సీఎం గా చెలామణి అవ్వాలని ఆశపడ్డ శివసేన కు అజిత్ పవార్ రూపంలో గట్టి ఝలక్ ఇచ్చింది.దీనితో ఇప్పుడు శివసేన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి లాగా తయారైంది.

అటు సీఎం పదవి కోసం అని ఎన్డీయే కూటమి నుంచి కూడా పక్కకు వచ్చిన శివసేన ఇప్పుడు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది సరికదా ఎన్డీయే కు కూడా దూరమైపోయింది.

Telugu Ajit Pawar, Ajitpawar, Bjp Ncp, Bjp Fadnavis, Maharaa, Sivasena-

దీనితో భవిష్యత్తులో ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది సస్పెన్స్ గా నిలిచింది.మరోపక్క మహారాష్ట్ర సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్ కు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి ఈ నెల 30 వరకు బల నిరూపణ కోసం గడువు ఇచ్చారు.మరి ఈ లోపు శరద్ పవార్ ను కూడా బుజ్జగించి అక్కడ బీజేపీ కొలువు ను సుస్థిరం చేసుకోవాలని ఆ పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తుంది.

మరి బీజేపీ వ్యూహం ఫలిస్తుందో,లేదంటే మరో ట్విస్ట్ ఏర్పడి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube