రెంట్ భారం భరించలేక 2 కోట్ల సెట్ తీసేస్తున్నారట..!

కరోనా వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది.ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అన్న సమయంలో తగ్గినట్టే తగ్గి కరోనా మరోసారి విలయ తాండవం చేస్తుంది.

 Ajay Devgn Thank God Movie 2 Crore Set Removed-TeluguStop.com

కరోనా కారణంగా చాలా సినిమాలు షూటింగ్ దశలోనే నిలిచి పోయాయి.దీనివల్ల నిర్మాతలకు చాలా నష్టాలు వచ్చాయి.

సినిమాల కోసం పెద్ద పెద్ద సెట్స్ వేసి రెడీగా ఉంచారు.

 Ajay Devgn Thank God Movie 2 Crore Set Removed-రెంట్ భారం భరించలేక 2 కోట్ల సెట్ తీసేస్తున్నారట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ కరోనా వచ్చి మొత్తం నాశనం చేసింది.

కోట్లు పెట్టి వేసిన సెట్స్ ఉపయోగించడానికి లేక మేకర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఒక్కసారి సెట్స్ వేసిన తర్వాత షూటింగ్ జరిగిన జరగకపోయినా రెంట్ మాత్రం కట్టాల్సిందే.

దీంతో నిర్మాతలకు మరింత భారం మోయాల్సి వస్తుంది.ఇలా చాలా సినిమాల షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోయిన కారణంగా ఆర్ధిక భారం నిర్మాతలపై పడుతుంది.

కోట్లు ఖర్చు పెట్టి వేసిన సెట్స్ ను రెంట్ కట్టలేక సెట్స్ ను తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఇప్పుడు ప్రజలు జీవించడానికే నానా అవస్థలు పడుతున్నారు.ఇంకా సినిమా షూటింగ్స్ చేసే పరిస్థితులు లేవు.ఇప్పట్లో మళ్ళీ షూటింగ్ మొదలయ్యే పరిస్థితి కూడా కనపడడం లేదు.

ఈ కారణంగా బాలీవుడ్ మూవీ కోసం 2 కోట్ల ఖర్చుతో వేసిన సెట్ ను రెంట్ కట్టలేక తీసేయాలని నిర్మాతలు అనుకుంటున్నారట.

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘థాంక్ గాడ్’.

ఈ సినిమాను ఇంద్రకుమార్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా జనవరిలో మొదలయ్యి మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వెంటనే వాయిదా పడింది.

ఈ సినిమా కోసం ముంబై లో ప్రైవేట్ స్టూడియోలో 2 కోట్ల ఖర్చుతో సెట్ ను వేశారు.

ఈ సెట్ ను భారీ ఖర్చుతో వేసి మళ్ళీ ఇప్పుడు ఆ సెట్ కోసం రెంట్ కట్టలేక ఈ సెట్ ను తొలగించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, మారుతీ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ బ్యానర్ లపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అశోక్ తాకేరియా, సునీల్, దీపక్ తదితరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

#Ajay Devgan #2Crore #AjayDevgn #Thank God Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు