ఆర్ఆర్ఆర్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్‌ హీరో

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీ్స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

 Ajay Devgn Joins Rrr Shooting-TeluguStop.com

పీరియాడిక్ ఫిక్షన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో ఆయన జాయిన్ అయ్యాడు.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

కొమురం భీం పాత్రలో తారక్ నటిస్తోండగా, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ మనకు కనిపిస్తాడు.ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ పాత్రపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మారిస్‌లు నటిస్తున్నారు.

మరి ఈ సినిమాలో అజయ్ ఎలాంటి పాత్రతో అలరిస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube