ఆర్ఆర్ఆర్ హీరోలను నిద్రలేపేది అతడే!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఈ సినిమాతో మరోసారి ఆలిండియా రికార్డుకు రాజమౌళి ఎసరు పెట్టాడని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Ajay Devgan, Rrr, Rajamouli, Ntr, Ram Charan-TeluguStop.com

కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందా అని అందరూ చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో తారక్, చరణ్‌లతో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కూడా నటిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న అజయ్ దేవ్గన్, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తాడట.అయితే ఆయన కూడా ఈ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపిస్తాడని, ఆయన చేసిన త్యాగంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పూర్తి పోందుతారని తెలుస్తోంది.

ఎన్టీఆర్, చరణ్‌లలో దేశభక్తిని తట్టిలేపే పాత్రలో అజయ్ దేవ్గన్ కనిపిస్తాడట.మరి అజయ్ దేవ్గన్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube