ఆర్ఆర్ఆర్‌లో ఆయన అప్పుడే కనిపిస్తాడా?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

 Ajay Devgan Role In Flashback Of Rrr, Ajay Devgan, Rrr, Ntr, Ram Charan, Rajamou-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను జక్కన్న షేక్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ పాత్రకు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మాత్రమే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఆయన పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతుందా, అసలు ఆయన ఈ సినిమాలో ఎప్పుడు కనిపిస్తాడా అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ పాత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో రానందని, ఆయన పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఆయన పాత్ర ఇద్దరు హీరోలు కలిసేందుకు స్పూర్తినిస్తుందని, చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

ఇక అల్లూరి రామరాజుగా చరణ్, కొమురం భీంగా తారక్‌ల పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండనుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్ సరసన ఒలివియా మారిస్ నటిస్తోంది.ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

మరి ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube