ఒక్క దెబ్బతో ఖైదీ పని పూర్తి!  

Ajay Devgan Planning To Complete Khaidi Remake In One Schedule, Ajay Devgan, Khaidi, Remake, Bollywood News - Telugu Ajay Devgan, Bollywood News, Khaidi, Remake

తమిళ హీరో కార్తీ నటించిన పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఖైదీ ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచింది.

TeluguStop.com - Ajay Devgan Planning To Complete Khaidi Remake In One Schedule

Source:TeluguStop.com

ఇక ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.కాగా ఈ సినిమా అందుకున్న సక్సెస్‌తో ఇప్పుడు ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు.

TeluguStop.com - ఒక్క దెబ్బతో ఖైదీ పని పూర్తి-Gossips-Telugu Tollywood Photo Image

ఇప్పటికే బాలీవుడ్‌లో హీరో అజయ్ దేవ్గన్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ నుండి మొదలుపెట్టాలని అజయ్ దేవ్గన్ భావిస్తు్న్నాడు.

ఈ క్రమంలో కేవలం సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని ఆయన చూస్తున్నాడు.ఎలాంటి గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్‌ను ముగించాలని, దీని కోసం ఇప్పటికే సెట్స్ కూడా వేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాను 2021 ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు అజయ్ దేవ్గన్ తెలపడంతో, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ సినిమాను అనుకున్న సమయానికే రిలీజ్ చేయాలని ఆయన చూస్తున్నాడు.

ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించి అంతే భారీ హిట్ చేయాలని ఆయన చూస్తున్నాడు.

ఇక ఈ సినిమా సౌత్‌లో సాధించిన సక్సెస్‌తో ఆయన ఈ సినిమా బాలీవుడ్‌లోనూ అదిరిపోయే సక్సెస్ అందుకుంటుందని ఆశిస్తున్నారు.మరి ఈ సినిమాను అక్కడ ఎవరు డైరెక్ట్ చేస్తున్నారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

#Remake #Ajay Devgan #Khaidi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ajay Devgan Planning To Complete Khaidi Remake In One Schedule Related Telugu News,Photos/Pics,Images..