ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ సినిమా చూడని అజయ్ దేవగన్... కారణం ఏంటో తెలుసా?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

 Ajay Devgan ,tollywood , Rrr Movie , Ajay Devgan Not Seen Rrr , Ntr , Ram Charan-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 35 రోజులు కావస్తోంది.కలెక్షన్ల పరంగా అద్భుతమైన రికార్డులు సాధించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా నటించారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈ సినిమాలో చిన్నప్పటి రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇకపోతే దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమాని ఇప్పటివరకు అజయ్ దేవగన్ చూడక పోవడం గమనార్హం.అయితే ఇప్పటి వరకు అజయ్ దేవగన్ ఈ సినిమాని ఎందుకు చూడలేదు అనే విషయానికి వస్తే.

సాధారణంగా ఆయన నటించిన సినిమాలు విడుదలైన వెంటనే ఆయన చూస్తే ఓకే.లేదా ఆ సినిమాలను చాలా ఆలస్యంగా చూడాల్సి వస్తే ఇకపై ఆ సినిమాలను ఎప్పటికీ అజయ్ దేవగన్ చూడరట.

Telugu Ajay Devgan, Ajay Devgan Rrr, Bollywood, Rajamouli, Ram Charan, Rrr, Toll

ఈ విధంగా అజయ్ దేవగన్ సినిమాలు చూడడానికి కూడా ఒక కారణం ఉంది.సినిమాలు విడుదలై చాలా రోజుల తర్వాత ఆ సినిమాని చూస్తే ఆ సినిమా చూస్తున్న క్షణంలో ఆ పాత్రలో అలా కాకుండా ఇంకా బాగా నటించాల్సి ఉండేదనే భావన తనలో కలుగుతుందట.అయితే అంతకన్నా బాగా నటించడం కుదరదు కనుక అలాంటి భావన రాకుండా ఉండడం కోసమే అజయ్ దేవగన్ తన సినిమాలు చూడరని ఓ సందర్భంలో వెల్లడించారు.ఈ క్రమంలోనే RRR సినిమా కూడా చూడలేదని అజయ్ దేవగన్ తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube