'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఈ బాలీవుడ్‌ స్టార్‌ పాత్రపై క్లారిటీ  

Ajay Devagan In Rrr Movie-alia Bhatt,r,rajamouli,ram Charan,rrr

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీపై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ చిత్రం కేవలం సౌత్‌ ప్రేక్షకుల వరకే పరిమితం కాకుండా బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో బాలీవుడ్‌ స్టార్స్‌ను ఈ చిత్రంలో నటింపజేస్తున్నారు. ఆలియా భట్‌ ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు..

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఈ బాలీవుడ్‌ స్టార్‌ పాత్రపై క్లారిటీ-Ajay Devagan In RRR Movie

సినిమా ప్రెస్‌మీట్‌లోనే ఈ విషయాన్ని రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. అయితే అజయ్‌ దేవగన్‌ పాత్ర ఏంటీ అనే విషయంపై క్లారిటీ రాలేదు. తాజాగా ఆవిషయమై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకు తండ్రి పాత్రలో అజయ్‌ దేవగన్‌ కనిపించబోతున్నాడు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఉద్దేశ్యంతో అజయ్‌ దేవగన్‌ పాత్రను సినిమాకు హైలైట్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది..

బాలీవుడ్‌లో ఇప్పటికే రాజమౌళిపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌ను కీలక పాత్రలో చూపిస్తే సినిమా స్థాయి మరింత హైలెవల్‌కు వెళ్లడం ఖాయంగా చెబుతున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అయినందువల్ల అజయ్‌ దేవగన్‌కు కీలక పాత్రను కట్టబెట్టినట్లుగా చెబుతున్నారు.

రాజమౌళి తన సినిమాలోని ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. కనుక అజయ్‌ దేవగన్‌ పాత్ర కూడా తప్పకుండా బాగుంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.